అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF)లో నెంబర్ 2 స్థానంలో ఉన్న గీతా గోపీనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గీతా గోపీనాథ్ వెల్లడించారు.
Pakistan: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న విదేశీ నిల్వలు, స్థానిక కరెన్సీ పతనం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి మరోసారి సహాయం చేసేందుకు రెడీ అయింది. దీంతో పాక్ లో పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టవచ్చు అని అభిప్రాయ పడింది.
India Pakistan: ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ అప్పుల కోసం పలు దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి భిక్షం అడుక్కుంటోంది. రుణాలు, బెయిలౌట్ ప్యాకేజీలపై ఎక్కువగా ఆధారపడుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బ తీసేలా భారత్ ప్లాన్ చేస్తోంది.
IMF: ఇటీవల భారత్ చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తోంది. తాజాగా అందిన నివేదికలో IMF పాకిస్తాన్‌పై మరో 11 కొత్త ఆర్థికపరమైన షరతులను విధించింది. దీంతో IMF విధించిన మొత్తం షరతుల సంఖ్య 50కి పెరిగింది. ఇక IMF నివేదిక ప్రకారం, పాకిస్తాన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌ను రూ.2.414 ట్రిలియన్‌గా ప్రణాళిక వేస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రూ.252…
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ నాశనం చేసిన ఉగ్రవాద నెట్వర్క్‌ని పాకిస్తాన్ పునర్నిర్మంచడానికి ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక యోధుల తెగువను ఆయన ప్రశంసించారు. భుజ్ వైమానిక స్థావరంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాది అయిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కి పాకిస్తాన్ ప్రభుత్వం రూ. 14 కోట్లను ప్రటించిందని, పాకిస్తాన్‌కి రుణం ఇచ్చే అంశాన్ని ఐఎంఎఫ్ పునరాలోచించాలని…
IMF: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారీగా నిధులు మంజూరు చేసింది. ఏకంగా 1 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 8,500 కోట్లు) నిధులను విడుదల చేసింది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు మరింత అవకాశం లభించింది. అయితే, ఈ ఆర్థిక సహాయం భారత్‌కు మరింత ముప్పుగా పరిణమించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐఎంఎఫ్ ఈ నిధులను విడుదల చేయడానికి కొన్ని షరతులు విధించినప్పటికీ,…
Omar Abdulla : జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “భారత సరిహద్దులపై పాకిస్తాన్ షెల్లింగ్ చేయడానికి IMF డబ్బులు తిరిగి చెల్లిస్తోందా?” అంటూ ఆయన నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో ఒమర్ అబ్దుల్లా చేసిన పోస్ట్ సంచలనం రేపింది. పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక సహాయం అందిస్తూ, అదే సమయంలో ఈ ప్రాంతంలో శాంతిని ఎలా ఆశిస్తున్నాయని ఆయన నిలదీశారు. “పూంచ్,…
India GDP: భారత ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా దూసుకెళ్తోంది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా పరుగులు తీస్తోంది. కేవలం దశాబ్ద కాలంలోనే భారత జీడీపి ఏకంగా 105 శాతం పెరిగింది. భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి (GDP)ని 2015లో $2.1 ట్రిలియన్ల నుండి 2025 నాటికి $4.3 ట్రిలియన్లకు రెట్టింపు అయింది. ఇలాంటి రికార్డ్ ఏ దేశానికి కూడా లేదు. కేవలం పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ డబుల్ అయింది.
IMF: భారత ఆర్థిక వ్యవస్థకు తిరుగు లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) రిపోర్టు వెల్లడించింది. మరికొన్ని రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఐఎంఎఫ్ ఈ నివేదికను ద్వారా గుడ్‌న్యూస్ చెప్పింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాలెన్స్ షీట్లో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ వార్షిక ప్రాతిపదికన మంచి ఆదాయాన్ని ఆర్జించింది. సెంట్రల్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే ఆర్‌బీఐ డబ్బు 2.5 రెట్లు ఎక్కువగా ఉంది.