Pakistan: ఎప్పుడూ లేనంతగా దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ పెట్టే అన్ని షరతులకు తలొగ్గుతోంది. దీంతో ప్రజలపై పన్నులను పెంచింది, ఇది తీవ్ర నిరసనకు దారి తీస్తోంది.
Pakistan: భారతదేశానికి ధీటుగా మా ఆర్మీ ఉంది, ఎప్పుడైనా కాశ్మీర్ ను రక్షించుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశ సైన్యానికి తిండి పెట్టే పరిస్థితుల్లో కూడా లేదు. చివరకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్ర ఇంధన సంక్షోభాన్ని చవిచూస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కూడా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతోంది. ఆ దేశానికి మిత్రదేశాలతో పాటు ఐఎంఎఫ్ వద్ద అప్పు పుట్టడం లేదు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక వేళ ఎంత ధర పెట్టి కొందాం అని అనుకున్న మార్కెట్లలో సరుకులు లభించడం లేదు. గోధుమ పిండి కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గోధుమ కోసం అక్కడి ప్రజలు ఓ యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే గోధుమ పిండి కేంద్రాల…
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పటికే దేశం వదిలిపారిపోయిన గొటబాయ రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లిన రాజపక్స తన రాజీనామా లేఖను పాక్స్ ద్వారా పార్లమెంట్ స్పీకర్ కార్యాలయానికి పంపించారు. తాజాగా ఈ రోజు స్పీకర్ మహిందా యాప అబేదర్థనే అధ్యక్షుడి రాజీనామాపై అధికార ప్రకటన చేయనున్నారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసిన తర్వాత శ్రీలంక నిరసనకారుల్లో ఆనందం కనిపిస్తోంది.…
ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. వేలాదిగా నిరసనకారులు కొలంబోలో నిరసనలు, ఆందోళ కార్యక్రమాలు చేపడుతున్నారు. శనివారం దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళను చేపట్టారు. పరిస్థితులు కట్టుతప్పే ప్రమాదం ఉండటంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన అధికార నివాసాన్ని వదిలి పారిపోయారు. శ్రీలంకన్ ఆర్మీ అధ్యక్షుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అధ్యక్ష భవనంతో పాటు, ఆయన పరిపాలన భవనాన్ని ఆందోళనకారులు ఆక్రమించారు. ఆందోళనకారుల్ని అదుపు చేయడంతో ఆర్మీ, పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఇదిలా ఉంటే…
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. శుక్రవారం దేశంలో పెద్ద ఎత్తున్న నిరసన, ఆందోళనలు జరిగాయి. ఆందోళనకారులు ఏకంగా ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని, సెక్రటేరియట్ ను ముట్టడించారు. పోలీస్ బందోబస్తు ఉన్నా కూడా ఆందోళకారుల్ని అదుపులో చేయలేకపోయారు. దీంతో నిరసనకారులు ప్రెసిడెంట్ భవనంలోకి ప్రవేశించారు. నిరసనకారులతో మాజీ ఆర్మీ అధికారులు, ప్రముఖ క్రికెటర్లు సనత్ జయసూర్య, కుమార సంగక్కర ఆందోళనలకు మద్దతు పలికారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వీడియో మాత్రం…
శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఇంధన, ఆహార సంక్షోభాలతో ఇక్కట్లు పడుతున్న శ్రీలంకలో మరోసారి నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికారిక భవనాన్ని ముట్టడించారు ఆందోళనకారులు. భద్రతాబలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకువచ్చారు నిరసనకారులు. దీంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సను సురక్షిత ప్రాంతానికి తరలించింది శ్రీలంకన్ ఆర్మీ. ఇదిలా ఉంటే రాజపక్స పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు వెంటనే అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్స రాజీనామా…
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన పొడవైన క్యూలే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి ప్రజలు చూస్తున్నా.. నిత్యావసరాలు దొరకడం లేదు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్, డిజిల్ స్టేషన్ల వల్ల పెద్ద ఎత్తున వాహనాలు, ప్రజలు దర్శనమిస్తున్నారు. ఇలాంటి సంక్షోభం మధ్య ఉండలేమనుకున్న ప్రజలు వేరే దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దేశం నుంచి విదేశాలకు వెళ్లి ఉపాధి పొందేందుకు పాస్పోర్ట్ కోసం ప్రజలు దరఖాస్తు చేస్తుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా…
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు. రోజుల తరబడి ఎదురుచూసిన శ్రీలంకలో లీటర్ పెట్రోల్ దొరకని పరిస్థితి ఉంది. విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం మరోసారి కీలక…
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆ దేశ ప్రభుత్వం పలువిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. చమురు నిల్వలు వేగంగా పడిపోతుండడంతో వాటిని ఆదా చేసేందుకు అత్యవసరం కానీ సేవలను సోమవారం నుంచి రెండు వారాలు నిలిపివేసింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పనిచేస్తున్నాయి. ఆస్పత్రులు, కొలంబో నౌకాశ్రయం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. పెట్రోల్ పంపుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి. మరోవైపు శ్రీలంకలో ఆర్థిక…