మనిషి అన్న ప్రతివాడు తప్పులు చేస్తాడు. కొన్ని సరిదిద్దుకోలేని.. కొన్ని సరిదిద్దుకోవాలని ప్రయత్నించినా కాలేనివి.. కానీ అలాంటి ప్రయత్నం చేయకపోతే వినాశనం తప్పదు. ఒక యువతి తాను చేసిన తప్పును సరిద్దిదుకోకపోవడం వలన ఆమె జీవితం ప్రస్తుతం అగాధంలోకి కూరుకుపోయింది. నమ్మినవాడు మోసం చేశాడు. కట్టుకున్నవాడు వదిలేశాడు.. చివరికి ఏమిచేయలేని నిస్సహాయక స్థితిలో పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కి చెందిన ఒక యువతి(20)కి చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతిచెందారు. ఒంటరిగా పెరుగుతున్న ఆమె జీవితంలోకి ఒక యువకుడు ప్రవేశించాడు. చిన్నతనం నుంచి ప్రేమ దక్కని ఆ యువతికి అతడి ప్రేమ ఏంతో ఓదార్పునిచ్చింది. కొన్నేళ్లు సహజీవనం చేసిన వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో వారు విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ రీత్యా వేరే ఊరుకు వెళ్ళిన యువతికి మరో యువకుడు పరిచయమయ్యాడు.. ఆ పరిచయం కాస్తా ప్రేమగామారి పెళ్ళికి దారితీసింది. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. రెండేళ్లు సంతోషంగా గడిచిపోయాయి అనుకొనేలోపు మాజీ ప్రియుడు ఎంటరయ్యాడు. ఆమె లేని సమయంలో ఆమె భర్త వద్దకు వెళ్లి వారిద్దరూ ఏకాంతంగా ఉన్న ఫోటోలను , వీడియోలను చూపించాడు. దీంతో బార్యాభర్తలమధ్య గొడవలు మొదలై భార్యను వదిలి భర్త వెళ్లిపోయాడు..
బాబుతో మళ్లీ ఒంటరి జీవితం గడుపుతున్న ఆమె జీవితంలోకి నువ్వే కావాలి అంటూ మాజీ ప్రియుడు మరోసారి రంగప్రవేశం చేశాడు. బాబుకు, తనకు తోడుగా ఉంటాడని నమ్మిన ఆమె సరేనని తాళికట్టకుండానే మసహజీవనానికి రెడీ అయిపోయింది. అదే ఆమె చేసిన తప్పు.. కొద్దిరోజులు సవ్యంగానే ఉన్న అతడిలోని మృగం కొద్దికొద్దిగా బయటపడింది. ఒకరోజు భార్యకు మత్తుమండు ఇచ్చి వారి స్నేహితులతో కలిసి రేప్ చేశాడు. ఈ విషయం తెలిసినా బిడ్డల కోసం మోనంగా ఉండిపోయింది. ఇక ఆమె మౌనంగా ఉండడంతో ఇటీవల మరోసారి మత్తుమందు ఇచ్చి ఇంకో ముగ్గురు స్నేహితులతో కలిసి రేప్ చేశాడు. అతడి ఆగడాలు తట్టుకోలేని యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.