ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన మల్లికార్జునుడితో పాటు శక్తిపీఠంగా భ్రమరాంబదేవి కూడా కొలువైన శ్రీశైలం మహాక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో ఎస్.లవన్న వెల్లడించారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు. అయితే కుటీర నిర్మాణ పథకం కింద వసతి గదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలో మాదిరిగా ముందస్తు రిజర్వేషన్ ఉంటుందన్నారు.శ్రీశైలంలో జరిగే…
రేపటి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు 4 రోజులు రాయలసీమ పర్యటన చేయనున్నారు. ఇప్పటికే సోము వీర్రాజు కర్నూలు చేరుకున్నారు. రేపు కర్నూల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొంటారు. బనగానపల్లెలోను సోమూవీర్రాజు పర్యటిస్తారని బీజేపీ శ్రేణులు తెలిపాయి. నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్త సుజన్ పురోహిత్ కుటుంబాన్ని పరామర్శించనున్న సోము వీర్రాజు. ఎల్లుండి అనంతపురంలో పర్యటిస్తారు. 21న గూడూరులో పోలీసులు అరెస్ట్ చేసిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. 22న ఆత్మకూరు ఘటనపై కర్నూలులో…
ఇంటికొచ్చి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తాను అంది.. సరేనని ఆ మహిళ ముందు వెనుక ఆలోచించకుండా ఆ ఇంట్లోకి ఆహ్వానించింది.. వ్యాక్సిన్ కన్నా ముందు కళ్లలో చుక్కలు వేయాలని.. ఒక మందు సీసాతో నిలబడింది. వ్యాక్సిన్ ఎలా వేస్తారో తెలియని ఆమె సరే అంది. అంతే ఇదే అదును అనుకోని కంట్లో చుక్కలు వేసి ఆమె మేడలో ఉన్న బంగారు గొలుసును తెప్పుకుబోయింది కిలాడీ లేడి.. ఈ ఘటన కర్నూల్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. స్టాంటన్‌పురంలో…
సాధారణంగా ఇంట్లో విలువైన వస్తువులు పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ కర్నూలు జిల్లాలో విచిత్రం చోటుచేసుకుంది. తన పెన్సిల్ పోయిందంటూ ఓ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో ఈ ఘటన జరిగింది. హన్మంతు అనే బాలుడు తన పెన్సిల్‌ను తోటి విద్యార్థులు దొంగతనం చేశారంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన పెన్సిల్‌ను దొంగతనం చేసిన విద్యార్థిపై కేసు పెట్టాలని పోలీసులను కోరాడు. Read Also: ఇంగ్లీష్ మాట్లాడుతున్న మహిళా…