Woman Constable Cheated Her Husband For Extramarital Affair In Unnao: ఎస్‌డీఎం జ్యోతి మౌర్య స్టోరీ గుర్తుందా? ఉద్యోగం వచ్చిన తర్వాత మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని, భర్తను ముప్పుతిప్పలు పెట్టింది. అతడు నిరసన తెలియజేసేదాకా.. ఆమె భర్తకు నరకం చూపించింది. సరిగ్గా ఇలాంటి ఉదంతమే ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. భౌనిఖేడా గ్రామానికి చెందిన విజయపాల్ సింగ్‌కు 2010లో ఛాయా సింగ్‌తో వివాహం అయ్యింది. అయితే.. ఛాయా సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కల ఉండేది. తన మనసులోని మాటను పెళ్లైన కొన్ని రోజుల తర్వాత ఛాయా తెలపగా.. ఆమెని చదివించడం కోసం భర్త విజయపాల్ ముందుకొచ్చాడు.
Tomato Price: ఇండియాలో టమాటా ధరల ఎఫెక్ట్.. దుబాయ్ నుండి ఆర్డర్..!
కానీ.. విజయపాల్ కుటుంబ సభ్యులు మాత్రం అందుకు వ్యతిరేకం తెలిపారు. కోడలన్నాక ఇంట్లోనే ఉండాలని వాదించారు. విజయపాల్ మాత్రం వారిని వ్యతిరేకించి.. భార్య కలని సాకారం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భార్యని ఉన్నావ్ నగరంలో ఒక మంచి కోచింగ్ సెంటర్‌లో చేర్పించాడు. ఆమెని చదివించేంత డబ్బు తన వద్ద లేకపోయినా.. అతడు కష్టపడి పైసాపైసా కూడబెట్టాడు. అప్పు కూడా చేశాడు. ఫైనల్‌గా.. ఛాయా సింగ్ ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరైంది. అందులో మంచి ఉత్తీర్ణనతో పాస్ అవ్వడంతో.. ఆమెకు 2016లో మహిళా కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. బారాబంకి జిల్లాలో కానిస్టేబుల్‌గా విధుల్లో కూడా చేరింది. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలైంది.
Nama Nageswara Rao: రైల్వే మంత్రితో ఎంపీ నామ భేటీ.. ఆ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి
ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే ఛాయా సింగ్‌కు అక్కడ ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల్లోనే అది వివాహేతర సంబంధంగా మారింది. ఓవైపు ఈమె కోసం చేసిన అప్పులు తీర్చడానికి నానాతంటాలు పడుతుంటే, మరోవైపు ఛాయాసింగ్ మాత్రం పరాయి మగాడితో రాసలీలలు కొనసాగించింది. చివరికి.. ఆ వ్యక్తితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే.. జులై 16వ తేదీన ఛాయాసింగ్ తన భర్తకు తెలియకుండా ప్రియుడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయం తెలిసిన భర్త.. తనకు న్యాయం చేయాలని, తన భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.