Shocking: ప్రేమ, పెళ్లి, ద్రోహం.. సెప్టిక్ ట్యాంక్‌లో పుర్రె.. 6 నెలల తర్వాత తెలిసిన నిజం..
- ప్రేమ, పెళ్లి, ద్రోహం, హత్య..
- ప్రియుడితో కలిసి భర్త మర్డర్..
- 6 నెలల తర్వాత తెలిసిన అసలు నిజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: ఆరు నెలల క్రితం మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. చివరకు పోలీసుల విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా ప్రారంభమైన లవ్ స్టోరీ, చివరకు ద్రోహం, వ్యసనం, హత్యగా మారింది. మధ్యప్రదేశ్‌లోని డియోరి నగరంలో తప్పిపోయిన 22 వ్యక్తి కేసులో భయంకరమైన నిజాలు తెలిశాయి. నిందితుడి ఇంటి వెనక ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో మృతుడి పుర్రె, ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సాగర్ జిల్లాకు చెందిన ప్రిన్స్ వాల్మికి ఆగస్టు 20 నుంచి కనిపించకుండా పోయాడు. అతడి భార్య తులసి పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడం పోలీసులు దర్యాప్తును నిలిపేశారు. అయితే, ప్రిన్స్ అదృశ్యంపై కుటుంబ సభ్యులకు అనుమానం రావడం, పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో విచారణ మలుపు తిరిగింది. సాంకేతిక నిఘా, మొబైల్ ట్రాకింగ్ పోలీసులను నిందితుడు షోయబ్ ఇంటికి తీసుకెళ్లాయి. నర్సింగ్‌పూర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
Read Also: SL vs OMAN: పసికూనను గడగడలాడించిన శ్రీలంక.. ఓమాన్‌పై 105 పరుగుల ఘన విజయం!
విచారణలో ప్రేమ వ్యవహారం కారణంగా ప్రిన్స్‌కు మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకునన్నాడు. ప్రిన్స్‌తో తులసికి వివాహం కాకముందే షోయబ్‌తో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. వివాహం తర్వాత కూడా తులసి, షోయబ్ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. పెళ్లయిన నెలలోనే తులసి ప్రవర్తన మారిందని, ఇంట్లో తరుచుగా వివాదాలు ప్రారంభమయ్యాయని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు.
షోయబ్, ప్రిన్స్‌తో స్నేహాన్ని పెంచుకుని, అతడి మద్యానికి బానిస చేసినట్లు విచారణలో తేలింది. షోయబ్, తులసిలు రహస్యం కలవడాన్ని గుర్తించిన ప్రిన్స్ అభ్యంతరం తెలుపడంతో ఇద్దరూ కలిసి హత్యకు ప్లాన్ చేశారు. ఆగస్టు 20న ప్రిన్స్‌కు మత్తుమందు ఇచ్చి హత్య చేసి, అనుమానం రాకుండా అతడి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసినట్లు తేలింది. ఆధారాలు తుడిచిపెట్టడానికి నిందితుడు మృతదేహం వేగంగా కుళ్లిపోయేలా చేసేందుకు ఉప్పు చల్లినట్లు తెలిసింది. ప్రిన్స్ ఎముకలను డీఎన్ఏ టెస్ట్ కోసం పంపించారు. హత్య తర్వాత షోయబ్ తులసితో కలిసి గుజరాత్ పారిపోయారని, ఇద్దరూ కలిసి నివసిస్తున్నట్లు తేలింది.
తాజావార్తలు
-
PayPal Layoffs: పేపాల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
-
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్‌గా మారిందని ఆరోపణ..
-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
-
Mayawati: ఎన్నికల వేళ మేనల్లుడికి మాయావతి షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!