Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir Donation Scam: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం కానుకల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే కానుకల దొంగతనం కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ, ఇప్పుడు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న నగదు వివరాలు దర్యాప్తు సంస్థకు కొత్త అనుమానాలకు తావిచ్చాయి. దొంగతనం వెలుగులోకి రాకముందు జమైన మొత్తంతో, ప్రస్తుతం జమవుతున్న మొత్తాన్ని పోల్చితే భారీ వ్యత్యాసం కనిపించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆర్థిక అవకతవకల కోణంలో విచారణను ముమ్మరం చేసింది.
జమ మొత్తంలో భారీ వ్యత్యాసం
సమాచారం ప్రకారం, దొంగతనం బయటపడక ముందు రామ మందిర ట్రస్ట్‌కు చెందిన ఎస్బీఐ, పీఎన్బీ బ్యాంకు ఖాతాల్లో రోజుకు సుమారు రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు కానుకల నగదు జమయ్యేది. అయితే దొంగతనం వెలుగులోకి వచ్చిన తర్వాత అదే మొత్తం రోజుకు రూ.24 లక్షల నుంచి రూ.26 లక్షలకు పెరిగింది. ఈ వ్యత్యాసాన్ని పరిశీలించిన SIT, గతంలో ప్రతిరోజూ సుమారు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు నగదు పక్కదారి పట్టి ఉండొచ్చని అనుమానిస్తోంది.
Also Read
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
బ్యాంకు ఉద్యోగుల విచారణ
ఈ వ్యవహారంలో నిజానిజాలు వెలికితీసేందుకు SIT దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్‌తో పాటు మొత్తం 10 మంది బ్యాంకు ఉద్యోగులను అధికారులు ప్రశ్నించారు. అలాగే సంబంధిత బ్యాంకు పత్రాలు, లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇద్దరు, ముగ్గురిపై అనుమానాలు
ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల పాత్రపై అనుమానాలు వ్యక్తమైనట్లు సమాచారం. వారి కార్యకలాపాలు, నగదు లావాదేవీలపై SIT లోతుగా విచారణ కొనసాగిస్తోంది. డబ్బు ఎక్కడికి వెళ్లింది, ఇందులో మరెవరి ప్రమేయం ఉందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం
రామ మందిరం కానుకల వ్యవహారంలో రోజువారీ నగదు జమల్లో కనిపించిన భారీ వ్యత్యాసం కేసును మరింత కీలకంగా మార్చింది. ప్రస్తుతం సేకరించిన ఆధారాలు, బ్యాంకు రికార్డుల ఆధారంగా SIT దర్యాప్తును కొనసాగిస్తుండగా, రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర కానుకల దొంగతనం కేసు సంచలనంగా మారింది.. ప్రతిరోజూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, దర్యాప్తు పరిధి వేగంగా విస్తరిస్తోంది.
తాజావార్తలు
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?