Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- మద్యానికి బానిసైన కొడుకు..
- యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు..
- ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parents Kill Son: తల్లిదండ్రులు కొడుకును చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్‌కోట్ జిల్లా, గోండల్ తాలూకాలోని గుండాలా గ్రామంలో జరిగింది. మద్యపానం అలవాటు కారణంగానే తల్లిదడ్రులు కొడుకును చంపినట్లు తేలింది. జూన్ 30న హత్య చేసిన తర్వాత, దీనిని ఆత్మహత్యగా మార్చాలని ప్రయత్నించారు, అయితే పోస్ట్‌మార్టం రిపోర్టులో హత్య అని బయటపడింది.
మృతుడిని 25 ఏళ్ల రామ్ బాబుభాయ్ బాంభవాగా గుర్తించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతుడి భార్య అత్తామామలపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ ప్రచారం, రామ్ తీవ్ర మద్యపానం అలవాటు ఉంది. దీని వల్ల ఇతను తన తండ్రి బాబూ భాయ్, తల్లి మనీషా బెన్‌లతో తరుచూ గొడవ పడుతుంటేవాడు. సంఘటన జరిగిన రోజు మళ్లీ గొడవ జరిగింది. వివాదం ముదరడంతో తల్లి రామ్‌కు బలవంతంగా యాసిడ్‌ను తాగించిందని, తండ్రి అతన్ని కొట్టి ఆపై గొంతు నులిమి చంపేసినట్లు తేలింది.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు స్థానిక రాజకీయ పలుకుబడిని వాడేందుకు బాబు భాయ్ ప్రయత్నించాడు. ఎవరీకి అనుమానం రాకుండా గోండల్ సివిల్ ఆస్పత్రికి తరలించి, త్వరగా పోస్టుమార్టం నిర్వహించాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే, పోలీసులు సమగ్ర దర్యాప్తు , పోస్టుమార్టం నివేదిక తర్వాత హత్యగా తేల్చారు. బాధితుడి భార్య బన్షీబెన్ భవ ఇచ్చిన ఫిర్యాదుతో గోండల్ పోలీసులు ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!