Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. వేడి వేడి టీతో పాటు కరకరలాడే ఉల్లిపాయ పకోడీ తింటే ఆ మజానే వేరు. అయితే చాలామందికి ఇంట్లో పకోడీ చేసేటప్పుడు బయట స్వీట్ షాపుల్లో దొరికే అంత క్రిస్పీగా రాదు. అయితే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలతో, హోటల్ స్టైల్లో కరకరలాడే ఉల్లిపాయ పకోడీని ఇంట్లోనే ఎంతో సులభంగా ఎలా తయారుచేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
* ఉల్లిపాయలు (సన్నగా, పొడవుగా తరిగినవి) – 300 గ్రాములు
* శనగపిండి – 1 కప్పు
* వరిపిండి (బియ్యప్పిండి) – ¼ కప్పు
* అల్లం వెల్లుల్లి ముక్కలు / పేస్ట్ – 1 టీస్పూన్
* పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి) – 3 లేదా 4
* కారం – 1 టేబుల్ స్పూన్
* ధనియాల పొడి – 1 టీస్పూన్
* జీలకర్ర – 1 టీస్పూన్
* కరివేపాకు – 2 రెబ్బలు
* వేడి నూనె – 2 టేబుల్ స్పూన్లు
* ఉప్పు – రుచికి సరిపడా
* డీప్ ఫ్రైకి సరిపడా నూనె – తగినంత
Also Read
- Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
- Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
తయారీ విధానం:
ఉల్లిపాయలను సిద్ధం చేయడం:
మొదటగా 300 గ్రాముల ఉల్లిపాయలను మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా.. మీడియం సైజులో పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని, చేత్తో బాగా నలుపుతూ విడదీయాలి. దీనివల్ల ఉల్లిపాయ పొరలన్నీ విడిపోతాయి.
మసాలాలు కలపడం:
విడదీసిన ఉల్లిపాయ ముక్కల్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కల పేస్ట్, జీలకర్ర, కరివేపాకు, ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలా చేత్తో గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఉల్లిపాయల్లోని సహజమైన నీరు బయటకు వస్తుంది. పకోడీ క్రిస్పీగా రావడానికి ఈ నీరే ముఖ్యం, విడిగా నీళ్లు ఎక్కువగా పోయకూడదు.
పిండిని కలుపుకోవడం:
ఇప్పుడు 1 కప్పు శనగపిండి, పకోడీ బాగా కరకరలాడటం కోసం ¼ కప్పు వరిపిండి (బియ్యప్పిండి) వేసుకోవాలి. పిండి అంతా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. అవసరమైతేనే కేవలం కొన్ని చుక్కల నీటిని చల్లుకుంటూ గట్టి ముద్దలా కలుపుకోవాలి (బజ్జీల పిండిలా జారుడుగా ఉండకూడదు).
సీక్రెట్ చిట్కా:
పిండిని కలిపిన తర్వాత, పకోడీల కోసం కాగుతున్న వేడి నూనె నుండి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకుని ఈ పిండి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది పకోడీలు మరింత క్రిస్పీగా మారడానికి సహాయపడుతుంది.
డీప్ ఫ్రై చేయడం:
స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి మీడియం ఫ్లేమ్‌లో వేడి చేయాలి. నూనె సరిగ్గా వేడెక్కిన తర్వాత, కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముక్కలుగా నూనెలో పకోడీల్లా వేసుకోవాలి. పకోడీలు వేసిన వెంటనే గరిటెతో తిప్పకుండా, కొద్దిసేపు ఆగిన తర్వాత అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్‌లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
పకోడీలు చక్కటి రంగులోకి రాగానే నూనె నుండి తీసి పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి మార్చుకోవాలి. చివరగా మిగిలిన నూనెలో కొద్దిగా కరివేపాకును వేయించి, పకోడీలపై చల్లుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పకోడీ సిద్ధం.
తాజావార్తలు
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..