Shocking: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. అబ్బాయికి, అమ్మాయికి పెళ్లి చేయాల్సింది పోయి, వారి పేరెంట్స్ లేచిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి, తన కూతురుకు కాబోయే అత్తగారితో లేచిపోయాడు. వధువు తండ్రి, వరుడి తల్లి ఇద్దరు కలిసి పారిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. పిల్లల నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందు ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో 8 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. గురువారం పోలీసులు పారిపోయిన మహిళను కనుగొన్నారు.