Hyderabad Crime: తెలుగు రాష్ట్రాల్లో ఓ గజ దొంగ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. పోలీసులకు దొరక్కుండా.. ఆనవాలు వదలకుండా చోరీల్లో సిద్దహస్తుడు. ముసుగులు, విగ్గులు ధరించి మహిళ వేషంలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా మారాడు. అయితే బాధితులు ముందు ఆ దొంగను ఒక మహిళ అని చెప్పడంతో పోలీసులు ఆయోమయంలో పడిపోయారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో ఇతగాడి బండారమంతా బయటపడింది. ఈ నాటీ దొంగపై పలు పోలీస్ స్టేషన్లలో 60కి పైగా కేసులు నమోదయ్యాయని తెలిసి షాక్ తిన్నారు.
Read also: Vikarabad Crime: వికారాబాద్ లో దారుణం.. తల్లిని చంపిన కసాయి కొడుకు..
సెప్టెంబర్ 4న హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ ఇంట్లో 60 తులాల బంగారం చోరీకి గురైంది. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న మరో ఇంట్లో చోరీ జరిగింది. దీనిపై దృష్టి సారించిన సీసీఎస్, రాజేంద్రనగర్ క్రైం పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. భోజగుట్టకు చెందిన గుంజపోగు సుధాకర్ (33)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్‌తో పాటు పేట్‌బషీర్‌బాగ్‌లో 2, రాయదుర్గంలో 1 మొత్తం 5 దొంగతనాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీల్లో సుధాకర్‌తో పాటు అతని సహచరులు బండారి శాంసన్, షాందేవ్ సలోంకే, అమర్జీత్ సింగ్, గుంజపోగు సురేష్‌లను అరెస్టు చేశారు.
Read also: CM Revanth Reddy: సివిల్ సప్లయిస్ విభాగం అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష..
నిందితుడు గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి అలియాస్ సల్మాన్ అలియాస్ కాకా అలియాస్ డేంజర్ అలియాస్ ఆంటోని ఇలా ఒక్కోచోట ఒక్కోపేరుతో ఓ ప్రాంతాన్ని ఎంచుకుని తాళం వేసిన ఇళ్లను గుర్తించేవారు. తర్వాత తన గ్యాంగ్‌తో కలిసి స్కెచ్ వేసేవాడు. సీసీ కెమెరాల కంట పడకుండా బైక్‌లు నడుపుతూ రెక్కీ నిర్వహిస్తాడు. ఒక్కోసారి బైక్‌ను ఓ చోట పార్క్ చేసి ఆయా ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్లేవాడు. దొంగతనానికి డేట్ ఫిక్స్ చేసుకుని, విగ్గులు కట్టుకుని స్కెచ్ వేసిన ఇంటికి మహిళ వేషం వేసుకుని వచ్చి, పని ముగించుకుని దొంగిలించిన వాహనంలో వెళ్లిపోయేవాడు. ఇలా దొంగతనాలు చేస్తూ చిల్ అవుతూ వచ్చాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.
Gachibowli-Nursing Student: శృతి ఆత్మహత్య ఘటన.. పోలీసులు ఏమన్నారంటే..