Gachibowli-Nursing Student: గచ్చిబౌలి రెడ్ స్టోన్ రూంలో నర్సింగ్ విద్యార్థి శృతి ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై 3 రోజుల దర్యాప్తులో భాగంగా శృతిది ఆత్మహత్యే అని పోలీసులు తేల్చి చెప్పారు. దీనికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. నర్సింగ్ స్టూడెంట్ శృతి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని నిర్ధారణకు వచ్చారు. శృతికి మహబూబ్ నగర్ లో మోటార్ డ్రైవింగ్ స్కూల్ లో జీవన్ పాల్ తో పరిచయం ఏర్పడింది. శృతి, జీవన్ పాల్ సహా మరో జంట హోటల్ లో రెండు రూమ్ లు అద్దెకు తీసుకున్నారు. హోటల్ రూమ్ లో తాగిన సమయంలోని పెళ్లి విషయంలో ఇరువురి మధ్య చర్చ జరిగింది. జీవన్ పెళ్లికి నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణ తలెత్తింది. ఇది కాస్త గొడవ, వాదలకు దారితీసింది.
వివాదం చెలరేగడంతో శృతిని ఆ గదిలోనే వదిలి జీవన్ తన మిత్రుడు గదికి వెళ్ళిపోయాడు. దీంతో మత్తులో వున్న శృతి తీవ్ర ఆవేదనకు లోనైంది. ఆ వేశంతో గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరుసటిరోజు హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒక యువతితో పాటు ఇద్దరు తీసుకున్నారు పోలీసులు. శృతి మృతికి కారణమైన జీవన్ ను కస్టడీ లోకి తీసుకుని విచారణ చేపట్టారు. సోమవారం (16)న శృతి అనే విద్యార్థిని రెడ్ స్టోన్ రూంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఇది హత్య అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శృతి ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చారు.
CM Revanth Reddy: సివిల్ సప్లయిస్ విభాగం అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష..