CM Revanth Reddy: ఇవాళ ఉదయం 11.30 కు సచివాలయంలో సివిల్ సప్లయిస్ విభాగం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. స్కిల్ ఎంప్లాయి రావడం లేదని పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారన్నారని.. అందుకే ఐటిఐ లను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చ బోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ పారిశ్రామిక వేత్తలతో ఆనంద్ మహేంద్ర సమావేశం అవుతారని నిన్న జరిగిన ఎంఎస్‌ఎఈ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేస్తారన్నారు. ఇందులో రాజకీయ ప్రయోజనం ఏం లేదన్నారు.
Read also: Karthi : కాస్త పబ్లిసిటీ చేయండి ‘బాబు’.. రిలీజ్ అవుతున్నట్టే తెలియదు..
పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇవాళ పాలసీ రెడీ చేశారన్నారు. పాలసీ లేకుండా ప్రభుత్వం నడవదన్నారు. ఇన్సెంటివ్ లు..గత ప్రభుత్వం ఇచ్చిన హామీ లు మేము చెల్లిస్తాం మని తెలిపారు. ప్రభుత్వం కంటిన్యూ ప్రాసేస్ అన్నారు. చంద్రబాబు తెచ్చిన ఐటి నీ..అంతకంటే ఎక్కువ వేగంగా వైఎస్ అభివృద్ధి చేశారు కాబట్టే.. ఇంత అభివృద్ధి చెందిందని తెలిపారు. కొవిడ్ కాలం లో మూడు వ్యాక్సిన్ లు ఇక్కడే తయార్ అయ్యాయి అన్నారు. ఐటి నీ తెచ్చింది..అభివృద్ధి చేసింది కాంగ్రెస్ అన్నారు. పరిపాలన విషయంలో మాకు ఎలాంటి భేషజాలు లీక్ అన్నారు. మంచి పని కొనసాగిస్తాం.. విఘాతం కలిగించే అంశాలు ఉంటే తొలగిస్తాం అన్నారు. విద్యార్దులు సర్టిఫికెట్లు సంపాదిస్తున్నారు అని తెలిపారు. కానీ ఉద్యోగంకి వచ్చేసరికి.. సర్టిఫికెట్లు అక్కరకు రావడం లేదన్నారు.
IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లా.. ముగ్గురు పేసర్లతో బరిలోకి భారత్! తుది జట్లు ఇవే