UtterPradesh: ఇద్దరు మహిళలు ప్రేమించుకున్నారు. ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. వారిలో ఒకరికి వారి ఇంట్లో పెళ్లి చేయాలని భావించారు. కానీ ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడటం లేదు. దీంతో సమస్య ఏమిటా? అని తల్లిదండ్రులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. దీంతో మరొక మహిళను అంతం చేయాలని పెళ్లి చేయాలనుకున్న అమ్మాయి వాళ్ల కుటుంబ సభ్యులు భావించారు. లింగ మార్పిడి చేసిన తరువాత ఇద్దరికి వివాహం చేస్తామని నమ్మించారు. లింగ మార్పిడికి తాంత్రిక స్వామి ఉన్నాడని నమ్మించి మహిళను వారి ఇంటికి తీసుకొచ్చి.. లింగమార్పిడి నెపంతో హత్య చేశారు. తాంత్రిక స్వామి స్వయంగా ఈ హత్యలో భాగస్వామి కావడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
Read also: Bonalu: తెలంగాణలో రేపటి నుంచి ఆషాఢ బోనాలు.. మొదటగా గోల్కండలో ఉత్సవాలు
ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం షాజహాన్‌పూర్ జిల్లాలో జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఎస్పీ ఎస్ ఆనంద్ వివరాలను వెల్లడించారు. ఆర్సీ మిషన్ పోలీసు స్టేషన్ ఏరియా నివాసి 30 ఏళ్ల ప్రియా, పువాయన్ నివాసి 24 ఏళ్ల ప్రీతిలు స్నేహం చేశారు. ఆ స్నేహం వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. వారు సేమ్ సెక్స్ రిలేషన్‌షిప్(సహజీవనం)లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ప్రీతి తన దారి తాను చూసుకోవాలని భావించింది. వేరే పురుషుడితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రియాతో ఉన్న సంబంధం కారణంగా ప్రీతికి సంబంధాలు రాలేదు. వచ్చినవి సెట్ కాలేదు. దీంతో ప్రీతి ఆమె తల్లి ఉర్మిలా ఓ తాంత్రికుడు మొహమ్మది ఏరియాకు చెందిన రామ్ నివాస్‌ను కలిశారు. వీరంతా కలిసి ప్రియను చంపేయడానికి ప్లాన్ చేశారు. అదే సమయంలో ప్రియా లింగ మార్పిడి చేసుకుని పురుషుడిగా మారాలని అనుకుంటున్నట్టు ప్రీతి ఆ తాంత్రికుడికి చెప్పింది. ఈ విషయాన్ని వారు అదునుగా తీసుకున్నారు. ప్రియను చంపేస్తే రూ. 1.5 లక్షలు చెల్లిస్తామని ప్రీతి తల్లి తాంత్రికుడికి హామీ ఇచ్చింది. అనుకున్నట్టుగానే.. ప్రియాకు ప్రీతి ఫోన్ చేసింది. తాంత్రికస్వామి ఆమె లింగ మార్పిడి చేస్తాడని నమ్మించింది.
Read also: Rashmika Mandana : రణ్ బీర్ కపూర్ పై పొగడ్తల వర్షం కురిపించిన రష్మిక..
ప్రియా ఏప్రిల్ 13వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చింది. అప్పటి నుంచి మళ్లీ కనిపించలేదు. ఏప్రిల్ 18వ తేదీన ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్వెలెన్స్ ఆధారంగా ప్రియా ప్రీతితో, తాంత్రికుడు రామ్ నివాస్‌తో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారంగా రామ్ నివాస్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించగా.. తానే ఆమెను చంపేసినట్టు అంగీకరించాడు. ప్రియను అడవిలోకి తీసుకెళ్లి లింగ మార్పిడి చేస్తానని నమ్మబలికామని వివరించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత నేలపై పడుకోమని, కళ్లు మూసుకోమని చెప్పగా ప్రియా అలాగే చేసిందని తెలిపాడు. అప్పుడే ఓ సుత్తె తీసుకుని గొంతుపై వేటు వేశానని వివరించాడు. తాంత్రికస్వామి, ప్రీతిలను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి జైలుకు పంపించారు. తాంత్రికుడి ఇంటిలో ప్రియను చంపడానికి వాడిన సుత్తెను పోలీసులు రికవరీ చేసుకున్నారు.