Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులను చంపి, తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బీబీనగర్ మండలం గొల్లగూడెంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
గొల్లగూడెం గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఐశ్వర్య రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి గల కారణాలను ఆమె ఆ లేఖలో పేర్కొంది. ఐశ్వర్య రాసిన లేఖలో తన అత్తగారి కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన ఆత్మహత్యకు అత్తింటి వారి వేధింపులే ప్రధాన కారణమని ఆమె పేర్కొంది. భర్త మేకల మహేష్ తన పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడని, కనీసం బట్టలు కూడా కొనిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!
తన భర్త ఆయన తల్లిదండ్రులు, సోదరి మాటలు విని తనను వేధించేవాడని లేఖలో రాసింది. తన పిల్లలను బాగా చదివించాలని కలలు కన్నానని, కానీ తాను లేకపోతే వారిని చూసేవారు ఎవరూ ఉండరనే ఆందోళనతోనే వారిని కూడా నాతో పాటు తీసుకెళ్తున్నానని (చంపేస్తున్నానని) లేఖలో పేర్కొంది. చివరగా తన మరణానికి కారణమైన భర్త, అత్త, మామ జీవితాంతం జైలులోనే ఉండాలని, అప్పుడే తన ఆత్మకు శాంతి కలుగుతుందని ఆమె లేఖలో రాసుకొచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?