Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Firecracker Shop Fire: వ్యాపారం పెంచాలనే ఉద్దేశంతో ఓ యజమాని చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలు తీసింది… రీల్స్ చేయిస్తుండగా ప్రమాదవశాత్తు బాణసంచా షాపులో మంటలు చెలరేగి ప్రమాదం జరగడంతో యజమాని ప్రాణాలు కోల్పోగా.. వాచ్ మెన్ తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బెల్ పూడికలో చోటు చేసుకుంది..
చిలకలూరిపేట పట్టణానికి చెందిన భూమా సురేష్ అద్దాల వ్యాపారంతో పాటు బొప్పూడి వద్ద కేఎస్ఎస్ పేరుతో బాణాసంచా హోల్ సేల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. దీపావళి సీజన్ నేపథ్యంలో అక్కడే ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. శుక్రవారం తన కుమారుడిని దుకాణానికి తీసుకెళ్లాడు. దీపావళి ఆఫర్లపై రీల్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని భావించాడు. దుకాణం ముందు కుమారుడితో టపాసులు కాల్పించాడు. ఇదే సమయంలో బాణసంచా దుకాణంలో పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణంలో ఉన్న టపాసులన్నీ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. షాపులోపల ఉన్న సురేష్ బయటకు రాలేక మంటల్లో చిక్కుకున్నాడు. కాలిపోతూ బయటకు వచ్చి పడిపోయాడు. ఈ ఘటనలో వాచ్ మెన్ మస్తాన్ రావుకు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సురేష్ ను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్‌గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!