కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో శనివారం ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంనకు చెందిన సుబ్బారావు చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తుండగా... శనివారం ఉదయం ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.