AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- 60 ఏళ్ల బామ్మ, 29 ఏళ్ల డాక్టర్‌గా ఫోజ్..
- వ్యాపారవేత్త నుంచి 22 లక్షలు మోసం..
- ఏఐ వీడియోలతో మోసం చేసిన మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI fraud: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగాలతో పాటు మోసాలకు కారణమవుతోంది. తాజాగా 60 ఏళ్ల మహిళ, 29 ఏళ్ల డాక్టర్‌గా నటిస్తూ ఓ వ్యాపారవేత్తను బురడీ కొట్టించింది. ఈ ఘటన చైనాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సదరు మహిళ వ్యాపారవేత్తతో సోషల్ మీడియాలో ప్రేమ బంధాన్ని కొనసాగించింది. ఆ తర్వాత అతడి నుంచి ఐదు నెలల్లో 1.7 లక్షల యువాన్లు (సుమారు రూ.22 లక్షలు) తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 1992లో పుట్టినట్లు చెప్పుకున్న మహిళ, తాను వైద్యురాలు అని చెప్పుకుంది. షాంఘైలో ఓ ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు నమ్మించింది. షాంఘైకి చెందిన ప్రాపర్టీ-ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ లియు హుమ్ ఆమె వలలో పడి మోసపోయాడు. 2021లో సోషల్ మీడియాలో పరిచయమైన సదరు మహిళ, ఆస్పత్రి కాంట్రాక్ట్ ఇప్పిస్తానని లియు హుయ్‌తో మాట కలిపింది. ఆ తర్వాత ఈ పరిచయం ప్రేమ బంధంగా మారింది.
సోషల్ మీడియాతో వల..
తన ఫేక్ గుర్తింపును నమ్మించేలా మహిళ యూ షియుజెన్ అనే పేరుతో సోషల్ మీడియాలో డిజిటల్ ప్రొఫైల్ తెరించింది. 5 ఏళ్లలో 7000 వీడియోలను పోస్ట్ చేసింది. 10 వేల మంది ఫాలోవర్లను కూడా సంపాదించింది. 29 ఏళ్ల మహిళలా ఫోజ్ ఇస్తూ, తన రోజూవారీ కార్యకలాపాలు, ఇతర కార్యక్రమాలపై కంటెంట్ క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె చేసిన వీడియోల్లో ఏఐతో ముఖాన్ని మార్చడం, చర్మాన్ని స్మూత్ చేయడం, బ్యాక్‌గ్రౌండ్ మార్చడం వంటివి చేసింది.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
లియు ఈ విషయం తెలియక పలుమార్లు ప్రేమించిన మహిళను కలవాలని భావించాడు. ఎన్నిసార్లు కలుద్దామని చెప్పినా మహిళ మాత్రం తప్పించుకునేది. తన తల్లి తమ ప్రేమను వ్యతిరేకిస్తుందని వ్యాపారవేత్తకు చెప్పేది. ఇదే కాకుండా తన తల్లి అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రొఫైల్ క్రియేట్ చేసింది. నిజానికి ఆమె తల్లి అప్పటికే మరణించినట్లు పోలీసులు విచారణలో తేలింది.
పెళ్లికి రూ.40 లక్షలు డిమాండ్..రూ.22 లక్షలు మోసం..
పెళ్లి చేసుకోవడానికి ఏకంగా 3 లక్షల యువాన్లు(రూ.40 లక్షలు) కట్నంగా ఇవ్వాలని, షాంఘైలో ఓ ఇల్లు కొనాలని లియును మహిళ కోరింది. అయినప్పటికీ హాస్పిటల్ కాంట్రాక్ట్ ఇప్పిస్తుందనే ఆశతో అతడు ఆమెను నమ్మాడు. 5 నెలల వ్యవధిలో 1.7 లక్షల యువాన్లు(రూ. 22 లక్షలు) ముట్టచెప్పాడు. చివరకు ఎలాంటి ప్రాజెక్టు దక్కకపోవడంతో అనుమానం వచ్చి పోలీసుల్ని ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అసలు విషయం తెలియడంతో షాక్..
దర్యాప్తులో అసలు విషయం తెలిసి పోలీసులతో సహా అంతా షాక్ అయ్యారు. ఆమె వయసు 65 ఏళ్లని తేలింది. 1961లో జన్మించిన ఆమె అసలు డాక్టర్ కాదని, గతంలో ఓ ఆస్పత్రిలో క్లీనింగ్, సపోర్ట్ సర్వీసుల్లో పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారవేత్త లియు పంపిన బ్యాంక్ అకౌంట్ కూడా యు పేరుతో లేకుండా మరో వ్యక్తి పేరుతో ఉన్నట్లు వెల్లడైంది. నిజానికి ఆమె క్రియేట్ చేసిన కొన్ని వీడియోలపై చాలా చిన్న అక్షరాల్లో ‘‘ఏఐ జనరేటెడ్’’ అని అనే డిస్క్లైమర్ ఉంది. అయినప్పటికీ దీనిని ఆమె కానీ , లియు గానీ గుర్తించలేదు. మోసం చేసిన డబ్బును తన కాస్మొటిక్ ట్రీట్మెంట్లు, స్కిన్ కేర్ ప్రొడక్టుల్ని కొనుక్కున్నట్లు వెల్లడైంది.
తాజావార్తలు
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!