తల్లి దండ్రులు పిల్లల భవిష్యత్ కోసం ఎన్నెన్నో కలలు కంటారు.. ఎలాంటి చదువులు చదవాలి.. ఏం ఉద్యోగాలు చెయ్యాలి దగ్గర నుంచి ఎలాంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చెయ్యాలి.. ఎలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలి అని పుట్టినప్పటి నుంచి ఎన్నెన్నో కలలు కంటుంటారు.. అయితే ఈరోజుల్లో కులం అనే మాటలు తక్కువగా వినిపిస్తున్నాయి.. కానీ కొంతమంది మాత్రం తాము చెప్పినదాన్ని వినాలని తమ నచ్చిన వారిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు.. ఒకవేళ వాళ్ల మాటలు వినకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు.. తాజాగా ఇలాంటి దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది..
తమ కులం కన్నా తక్కువ కులం వ్యక్తిని ప్రేమించిందని కోపంతో రగిలిపోయిన తండ్రి.. అతి దారుణంగా కూతురును గొంతు కోసి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది..దళిత యువకుడిని ప్రేమించిందన్న కారణంతో కన్న కూతుర్ని కడతేర్చాడు ఓ తండ్రి. ఎస్సీ యువకుడిని ప్రేమించి పరువు తీసావంటూ.. కడుపున పుట్టిన బిడ్డ అనే జాలి కూడా లేకుండా గొంతు కోసి చంపేశాడు.ప్రేమ వ్యవహారంలో తండ్రి చేతిలో బలైపోయింది కీర్తి. ఎస్సీ యువకుడు గంగాధర్‌ను ప్రేమించడం కీర్తి పాలిటి శాపంగా మారింది. ఈ దారుణ ఘటన కర్నాటకలోని కోలార్ జిల్లా బంగారుపేటలో చోటుచేసుకుంది…
తన ప్రియురాలు కీర్తి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న గంగాధర్ ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. కీర్తి, గంగాధర్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమ పెళ్లిని నిరాకరించాడు కీర్తి తండ్రి….అమ్మాయికి ఎంత చెప్పినా వినలేదు దాంతో విసిగిపోయిన తండ్రి పదునైన కత్తితో గొంతు కోసి చంపేశాడు.. ప్రియుడు ఇచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపించారు.. ఈ పరువు హత్యతో రాష్ట్రం అంతా కలకలం రేపుతుంది.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..