Crypto : కరీంనగర్ క్రిప్టో గేమ్.. చివరికి ఎవరి చేతిలో లాభం..?
- క్రిప్టో మోసం కేసులో మాజీ కార్పొరేటర్ సతీష్ అరెస్ట్
- “మూడింతల లాభాలు” పేరుతో కోట్ల రూపాయల మోసం
- బాధితుల ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు వేగం
- ప్రధాన నిందితుడు లోకేష్ కోసం ప్రత్యేక బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crypto : కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు ఎగనామం చేసిన ముఠాపై పోలీసులు నిఘా కుదిపారు. “మూడింతల లాభాలు వస్తాయి” అంటూ ప్రజలను నమ్మబలికిన ఈ గ్యాంగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తీగలగుట్టపల్లికి చెందిన నున్సావత్ భాస్కర్ సెప్టెంబర్ 11న కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు పరిచయస్తుడైన మాజీ కార్పొరేటర్ సతీష్ “మెటా ఫండ్ క్రిప్టో” పేరుతో ఒక స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మూడు నెలల్లో మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికాడని భాస్కర్ వివరించారు. ఈ హామీ నమ్మి మొదట రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టగా, మరికొందరిని తీసుకురావాలని చెప్పడంతో మరో 17 మందిని చేర్చారు. వారి నుండి మొత్తం రూ.1.20 కోట్లు సతీష్ వసూలు చేశాడు. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
Teja Sajja : ప్రభాస్ ది గోల్డెన్ హార్ట్.. అడగ్గానే సాయం చేస్తాడు..
డబ్బులు అడిగిన బాధితులను సతీష్ బెదిరించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ వ్యవహారంలో మరో కొంతమంది నిందితులు ఉన్నారని భావించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లోకేష్ అనే మరో కీలక నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ క్రిప్టో మోసం కేసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు, అందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చాలామంది ఇప్పటికీ భయంతో ఫిర్యాదు చేయడం లేదని సమాచారం. ఈ దందాలో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు పోలీసులు భావిస్తున్నారు. సతీష్ వద్ద నుండి ఒక ఐపాడ్, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని బ్యాంక్ అకౌంట్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సతీష్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరుతున్నట్లు కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు.
BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా హర్భజన్ సింగ్?.. టర్బోనేటర్ టు అడ్మినిస్ట్రేటర్!
తాజావార్తలు
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!