కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు ఎగనామం చేసిన ముఠాపై పోలీసులు నిఘా కుదిపారు. “మూడింతల లాభాలు వస్తాయి” అంటూ ప్రజలను నమ్మబలికిన ఈ గ్యాంగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
Crypto Scam : క్రిప్టో కరెన్సీ.. ఇదొక ఊగిసలాట ట్రేడింగ్ దందా. నష్టాలు హైరిస్క్‌లో ఉంటాయి. కానీ కొంత మంది అధిక లాభాలు ఆశ చూపిస్తూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. క్రిప్టోలో పెట్టుబడి పెడితే మీ జీవితమే మారిపోతుందని చెబుతున్నారు. కానీ అమాయక జనం మాత్రం అందులో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.
Fraud : క్రిప్టో కరెన్సీ పేరుతో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసి దుబాయ్ పారిపోదామనుకున్న రమేష్ గౌడ్ వ్యవహారం మరో విషయం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి కరీంనగర్ వరంగల్ జిల్లాలో 100 కోట్లు వసూలు చేశాడు రమేష్. రమేష్ ని కాపాడేందుకు సీఐడీ అధికారుల ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్‌లో కేసు నమోదు అయినప్పటికీ అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వెలుగు చూశాయి. నిందితుడైన రమేష్ తో…