రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకొంది. ఒక మహిళ తనకు పరిచయమైన ఒక యువకుడి మర్మంగాన్ని కత్తితో కోసేసింది. అనంతరం ఏమి జరగనట్లు సారీ చెప్పి మళ్లీ అతనికి ఆపరేషన్ చేయించింది. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది.
వివరాలలోకి వెళితే.. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన ఒక యువకుడు(28) జైపూర్ లో యోగా టీచర్ గా పనిచేస్తున్నాడు. అతనికి కొద్దిరోజుల క్రితం ఫేస్ బుక్ లో ఒక మహిళ(35) పరిచయమైంది. ఆమె కూడా యోగా టీచర్ కావడంతో ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరు ఒకరింటికి ఒకరు వెళ్లి వస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం యువకుడిని కూరగాయలు తీసుకొని ఇంటికి రమ్మని మహిళ పిలిచింది. ఇంటికి వచ్చిన అతను .. ఆమెతో మాట్లాడి తిరిగి వెళ్ళడానికి బయల్దేరుతుండగా తాను ఇంటికి వస్తానని చెప్పడంతో ఇద్దరు యువకుడు ఇంటికి వెళ్లారు. అక్కడ ఇద్దరు భోజనం చేసి పడుకున్నారు. అతడు నిద్రపోతుండగా ఆమె కత్తితో అతని మర్మాంగాన్ని కోసేసి పరారయ్యింది.
ఉదయం నిద్ర లేచిన అతను కంగుతిని ఆ బాధతోనే ఆమెకు ఫోన్ చేసి ఏం చేశావ్ అని అడగగా, ఆమె ఏమి జరగనట్లు సారీ అని చెప్పి అతడికి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. వైద్యులు ఆపరేషన్ చేసి అతని మర్మాంగాన్ని అతికించేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అరెస్ట్ చేసి విచారించగా.. ఆహార పదార్ధాల్లో మత్తుమందు కలిపి ఆమె ఈ పని చేసిందని, అయితే ఆమె ఎందుకు ఈ పని చేసిందో మాత్రం చెప్పడంలేదని పోలీసులు తెలిపారు