టాలీవుడ్ హీరో నాగ శౌర్య గురించి పరిచయం అక్కర్లేదు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్ని ఎల్లప్పుడూ అలరిస్తుంటాడు. 2023లో విడుదలైన రంగబలి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అతను, ఇప్పుడు ‘ఏకంగా పోలీస్ వారి హెచ్చరిక’, ‘బాయ్ బాయ్ కార్తీక్’, ‘నారీ నారీ నడుమ మురారీ’ వంటి మూడు కొత్త సినిమాలతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీస్ షూటింగ్ దశలో ఉన్నాయి. వృత్తిపరంగా బిజీగా ఉన్న నాగ శౌర్య వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అడుగు పెట్టాడు.
Also Read : Rukmini Vasanth : ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది..
2022 నవంబర్‌లో బెంగళూరులోని అనుషా శెట్టిని వివాహం చేసుకున్న నాగ శౌర్య, కొద్దికాలంలోనే తండ్రయ్యాడు. గత ఏడాది ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. నవంబర్‌లో చిన్నారి మొదటి పుట్టిన రోజు గ్రాండ్‌గా జరిపారు.అయితే, పెళ్లి తర్వాత తల్లి ఉషా ముల్పురి తెలిపినట్లుగా, నాగ శౌర్య, కోడలు వేరే ఇంట్లో కాపురం పెట్టారు. “ఇద్దరు మంచివాళ్లు ఒకే చోట ఉండకూడదు” అనే నమ్మకంతో ఇప్పుడు వేరే ఇంట్లో ఉంటారని ఉషా వివరించారు. అంతే కాదు “నాకు ఇద్దరు కొడుకులు. చిన్నప్పుడే వాళ్లిద్దరికి ఆస్తమా ఉండేది. స్కూల్ కి పంపించకుండా ఇంట్లోనే చదివించేదాని. రోజంతా వాళ్లతో గడిపే దాని వాలే నా ప్రపంచం. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుని వేరుగా ఉండిపోవడంతో ఇల్లు బోసి పోయినట్లు అనిపిస్తుంది’ అని తెలిపారు. అలాగే..
‘అనూష ఎంతో మంచి పిల్ల. ఆమె మాకు మూడేళ్ల నుంచే బాగా పరిచయం. నాగశౌర్యకు సరైన జోడీ అని మాకు అనిపించింది. అందుకే వీళ్లిద్దరి పెళ్లి జరిపించాం. అనూషను మేము కూతురిలా చూశాం. తను కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటుంది.మమ్మల్ని తను మమ్మా, డాడీ అని పిలుస్తుంది. మా పెద్ద కోడలు యూఎస్‌లోని యాపిల్ కంపెనీలో జాబ్ చేస్తుంది. అనూష ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని ఆఫీస్‌కు వెళ్తుంది. ఎంతో బాగా ఆలోచించే అమ్మాయి. అయితే, పెళ్ళైన కొన్నిరోజులకే వాళ్లు వేరు కాపురం పెట్టారు. ఇలా ఉండాలని పెళ్లికి ముందే చెప్పుకున్నాం. దూరంగా ఉండి అప్పుడప్పుడు కలిస్తే బాగుంటుంది’ అంటూ ఉషా ముల్పురి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఉషా ముల్పురి ఫిల్మ్ ప్రొడక్షన్, రెస్టారెంట్ బిజినెస్‌లో చురుకుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్‌లో పలు రెస్టారెంట్లను నిర్వహిస్తున్నారు. నాగ శౌర్య త్వరలో విడుదలకాబోయే సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. సక్సెస్‌ఫుల్ కమ్‌బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ముందుకు వెళ్లుతున్న యంగ్ హీరోని అభిమానులు తీవ్రంగా మిస్ అవుతున్నారు.