రోజు రోజుకు మహిళలపై ఆఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన స్త్రీలు లైంగిక వేధింపులకు గురవుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే.. స్త్రీలపై చేసిన అఘాయిత్యాలు బయటకు రాకుండా హత్యలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా మృతదేహాలను దొరకకుండా ఉండేందుకు వివిధ మార్గాల్లో శవాలను మాయం చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే తాజాగా మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లి గ్రామ శివారులో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. మహిళను హత్య చేసి దుండగులు ఆమె మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టారు.
అయితే.. రాత్రి వర్షానికి వచ్చిన వరదతో మట్టికొట్టుకుపోవడంతో శవం బయటపడింది. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే.. మహిళను హత్య చేసి తగలబెట్టినట్టు ఆనవాళ్లు దొరికాయి. మహిళ ఒంటిపై బట్టలు లేకుండా ఉండడంతో.. మహిళను రేప్ చేసి చంపేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.