టాలీవుడ్ లోకి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. వైరల్ ప్రొడ్యూసర్ గా మారిన నిర్మాత నాగవంశీ బావమరిది హీరోగా లాంచ్ కాబోతున్నాడు. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మాత చిన్న బాబు అనేక సినిమాలు చేసుకొచ్చారు. తర్వాత ఆయన సోదరుడి కుమారుడు నాగవంశీ కూడా సినీ నిర్మాతగా మారి సితార ఎంటర్ టైన్మెంట్స్ అనే బ్యానర్ మొదలు పెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయన ఒక వైరల్ ప్రొడ్యూసర్. ఎందుకంటే నాగ వంశీ ఒక ట్వీట్ చేసినా, ఇంటర్వ్యూ ఇచ్చినా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఆయన బామ్మర్ది ఫిబ్రవరి 7వ తేదీన లాంచ్ కాబోతున్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
READ MORE: Acer Aspire 3: రూ. 50 వేల ల్యాప్ టాప్ రూ. 30 వేలకే.. లేట్ చేయకండి
అయితే ఆసక్తికరమైన ఈ విషయం ఏమిటంటే ఈ సినిమాని నాగవంశీ నిర్మించడం లేదు. ఇప్పటికే తెలుగులో కలర్ ఫోటో, తెల్లారితే గురువారం, బెదురులంక 2012 లాంటి పలు సినిమాలు నిర్మించిన బెన్నీ ముప్పానేని ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇక ప్రస్తుతానికి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో పలు ఆసక్తికరమైన సినిమాలు లైన్ అప్లో ఉన్నాయి. బహుశా భవిష్యత్తులో బావమరిదితో భాగం నుంచి కూడా సినిమాలు చేసే అవకాశాలు లేకపోలేదు.