Mumbai: తల్లి అనే పదానికి మాయని మచ్చని తీసుకువచ్చింది ఓ మహిళ. తన ముందే, తన బిడ్డపై అత్యాచారం చేస్తున్నా చూస్తూ ఉండిపోయింది. తన రెండున్నరేళ్ల కూతురు చనిపోతున్నా పట్టించుకోలేదు. ఈ ఘటన ముంబైలోని మాల్వానీ ప్రాంతంలో జరిగింది. నిందితుడు, సదరు మహిళ ప్రియుడిగా తేలింది. ఈ కేసులో ముంబై పోలీసులు రీనా షేక్ అనే మహిళతో పాటు, ఆమె లవర్ ఫర్హాన్ షేక్‌ని అరెస్ట్ చేశారు.
Read Also: Rana Naidu 2: నెట్‌ఫ్లిక్స్‌లో ‘రానా నాయుడు 2’ వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచంటే?
బాలికను చనిపోయిన స్థితిలో ఆస్పత్రికి తీసుకురావడంతో అనుమానించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాలికపై లైంగిక దాడి జరిగిందని, ఊపిరాడక షాక్ కారణంగా మరణించినట్లు వైద్యులు పోలీసులకు తెలిపారు. ఈ కేసును విచారించిన పోలీసులకు తల్లి క్రూరత్వం తెలిసింది. చిన్నారిపై తల్లి సమక్షంలోనే లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. చిన్నారి విషయంలో తల్లి రీనా జోక్యం చేసుకోకపోవడమే కాకుండా, ఆస్పత్రి సిబ్బందిని తప్పుదారి పట్టించిందని, బాలికకు మూర్ఛ వచ్చినట్లు చెప్పిందని పోలీసులు వెల్లడించారు.
ఇద్దరిపై పోక్సో చట్టంలోని పోక్సో చట్టంతో పాటు అత్యాచారం, లైంగికదాడి వంటి ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు ఇద్దరూ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసుపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.