Nandyal District: కరుడు గట్టిన రౌడీషీటర్ కు 6 నెలల పాటు జిల్లా బహిష్కరణ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి.. జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల పత్రాన్ని రౌడీషీటర్ ఎస్సీ బాబుకు అందించారు కోవెలకుంట్ల సీఐ హనుమంత నాయక్.. రౌడీషీటర్ ఎస్సీ బాబుపై వివిధ పోలీస్ స్టేషన్ లలో అనేక కేసులు ఉన్నట్లు వెల్లడించారు పోలీసులు. Read Also: Wife: రాత్రిపూట నా భార్య పాములాగ మారుతోంది సార్.. భర్త ఫిర్యాదు నంద్యాల…
భూ వివాదంలో కన్న కొడుకు ప్రాణాలనే తీసింది ఓ తల్లి.. తరచూ పొలం విషయంలో గొడవ జరగడం.. తాజాగా మరోసారి కూడా అదే ఘర్షణ జరగడంతో.. కొడుకునే తల్లి దారుణంగా హత్య చేసిందని మృతుడి భార్య ఆరోపిస్తోంది.
ముక్క లేకుంటే ముద్ద దిగాని వాళ్లు చాలా మంది ఉన్నారు. కనీసం వారానికి ఒకసారైనా మసాలా రుచి చూడకుంటే మనసు లాగేస్తుంది. ప్రతీ పూటా నాన్‌వెజ్ లాగించేవారు కూడా ఉన్నారు. ఈ డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని నంద్యాల జిల్లాలో చికెన్ సిండికేట్ ఏర్పాటైంది. డోన్‌లో వీరు కోసిందే కోడి..! చెప్పిందే రేటు అన్నట్టు తయారైంది పరిస్థితి.
ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆధునిక టెక్నాలజీతో ఏపీ రహదారులు పటిష్టంగా మారనున్నాయి, రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా డెన్మార్క్ డానిష్ ఫైబర్ టెక్నాలజీతో ఆర్ అండ్ బీ శాఖ వినూత్న ప్రయోగంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. నంద్యాల జిల్లాలో అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టును రద్దు చేసింది.. 800 మెగావాట్ల అవుకు పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు..
ఎంతో మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ.. ఆ పేరుతో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి.. నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పది మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరుతో కూటమి ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందన్నారు..
స్కూల్ గోడ కూలి మూడో తరగతి విద్యార్థిని మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం విద్యానగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉర్దూ స్కూలులో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని మాహిన్... స్కూల్ ప్రహరీ గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి వయస్సు ఎనిమిదేళ్లు..
నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు హాస్పటల్‌లో వాచ్‌మెన్ వైద్యుడి అవతారమెత్తాడు. వైద్యులు విధులకు హాజరుకాకపోవడంతో అక్కడి వాచ్‌మెన్, సిబ్బందే వైద్య సేవలందిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన గర్భిణీలకు మెడికల్ చెకప్‌లు చేస్తున్నారు. ఇంజెక్షన్‌లు చేస్తూ మందులు కూడా ఇస్తున్నారు.
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలోని గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. మంటలు వ్యాపించకముందే కుటుంబసభ్యులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు
నంద్యాల జిల్లాలో పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేయడంతో.. మైనర్ బాలిక బలైంది. నందికొట్కూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో వ్యాసమోల్ తాగి బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది బాధితురాలు..