బంగారానికి డిమాండ్ మన దేశంలో ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 45,500 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 260 తగ్గి రూ. 49, 100 కి చేరింది. ఇక బంగారం ధరలు తగ్గగా….వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.700 తగ్గి రూ. 64,600 వద్ద కొనసాగుతోంది.