దేశంలో కరోనా మహమ్మారి తరువాత సెకండ్ హ్యాండ్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. సెకండ్ హ్యాండ్ కార్లకు ఏ విధంగా డిమాండ్ ఏర్పడిందో సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ల వ్యాపారం కూడా జోరుగా సాగుతున్నది. ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ లెక్కల ప్రకారం 2021లో 2.50 కోట్ల సెకండ్ హ్యాండ్ మొబైళ్లు ఇండియా మార్కెట్లో అమ్ముడయ్యాయి. దీని విలువ 2.3 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 2019 నుంచి 21 వరకు సెకండ్ హ్యాండ్ మొబైళ్ల వ్యాపారంలో 14 శాతం వృద్ది నమోదైనట్టు ఐసీఈఏ తెలియజేసింది. 2025 నాటికి ఈ వ్యాపారం 4.5 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.