డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. దాన్ని నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. సంపాదించిన సొమ్ము వృథా కాకూడదు అంటే అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపుకు కేటాయించాలి. అలా పొదుపు చేసిన మొత్తాన్ని మంచి రాబడినిచ్చే పథకల్లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు కొంత సొమ్మును ఆదా చేస్తే అది మీ డబ్బును రెట్టింపు చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే? ఆదా చేయడం ఎలా అని ఆలోచిస్తుంటారు. ఎక్కువ మొత్తంలో ఆదా చేయాలా? లేదా తక్కువ మొత్తంలో ఆదా చేయాలా అని తెలియక తికమకపడుతుంటారు. ఇలాంటి వారు డబ్బును ఇలా ఆదా చేసి చూడండి. అద్భుతాలు సృష్టించొచ్చు. మీరు కన్న కలల్ని నిజం చేసుకోవచ్చు.
Also Read:Kishan Reddy : కేసీఆర్, రేవంత్‌కు ఏమాత్రం తేడా లేదు
సంపాదించిన దాంట్లో ఎంత ఆదా చేస్తున్నమన్నదే ముఖ్యం. రోజకు రూ. 10 అయినా సరే ఏడాదిలో మీరు ఊహించని సొమ్ము జమ అవుతుంది. అయితే మీరు తేదీల ప్రకారం ఆదా చేస్తే.. సేవ్ అయినసొమ్మును చూసి మీరే ఆశ్చర్యపోతారు. నెల రోజుల్లో మీరు రూ. 4,650 జమ చేస్తారు. అదెలా అంటే.. 1వ తారీఖున రూ. 10 ఆదా చేయాలి. 2వ తారీఖున రూ. 20, 3న రూ. 30, 4న రూ. 40.. ఇలా 30వ తారీఖున రూ. 300 ఆదా చేయాలి. ఈవిధంగా ఆదా చేస్తే నెల రోజుల్లో మీరు ఆదా చేసిన మొత్తం రూ. 4650 అవుతుంది. ప్రతి నెల 30 రోజుల చొప్పున ఆదా చేసుకుంటూ పోతే, ఏడాదిపాటు మీరు ఈ విధానాన్ని అనుసరించినట్లైతే మీరు ఆదా చేసిన సొమ్ము రూ. 55,800 జమ అవుతుంది.
Also Read:Nara Lokesh: కూటమి నేతలంతా కలిసికట్టుగా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి..
ఇలా ప్రతి సంవత్సరం ఆదా చేస్తే మీరు లక్షల్లో కూడబెట్టుకోవచ్చు. ఇలా ఆదా చేసుకున్న మొత్తాన్ని విలువైన వస్తువులను కొనేందుకు ఉపయోగించుకోవచ్చు. బంగారం, బైకు, కారు ఇలా ఏదైనా మీ సొంతం చేసుకోవచ్చు. తక్కువ శాలరీ, ఎక్కువ శాలరీ అనే ఆలోచన అక్కర్లేదు. జస్ట్ రూ. 10 రూపాయలతో ఆదా చేయడం ఆరంభిస్తే చాలు మీకు భవిష్యత్తులో ఆర్థిక కష్టాలను దరిచేరనీయదు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆదా చేయడం ప్రారంభించండి.