పసిడి ధర వరుసగా రెండో రోజు కూడా పెరిగింది. నిన్నటితో పోల్చితే నేడు బులియన్ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పుంజుకుంది. రూ.540 మేర పెరగడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.1500 మేర పెరిగింది. నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.68,500 అయింది.
APలో పెరిగిన బంగారం ధర..
AP మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,470 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,100 కు ఎగబాకింది. రూ.1,500 మేర పుంజుకోవడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.68,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, తిరుపతిలో రూ.540 మేర పెరగడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,100 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.68,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధర..
1. ఢిల్లీలో రూ.500 పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.48,100 కి పుంజుకుంది.
2. చెన్నైలో బంగారంపై రూ.480 పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580 తో దేశంలోనే రికార్డ్ ధరలో విక్రయాలు జరుగుతున్నాయి.
3. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,470గా ఉంది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.