Today (07-01-23) Business Headlines: గ్లాండ్ ఫార్మా చేతికి ఐరోపా సంస్థ: ఐరోపా సంస్థ సెనెగ్జి గ్రూపులో మొత్తం వాటా కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీ గ్లాండ్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ అనుబంధ సంస్థ గ్లాండ్ ఫార్మా ఇంటర్నేషనల్ పీటీఈ ద్వారా ఈ షేరును దక్కించుకుంటుంది. దాదాపు 20 ఏళ్ల కిందట ఏర్పాటైన సెనెగ్జి గ్రూపు.. ఫ్రాన్స్ మరియు బెల్జియం దేశాల్లో ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తి తదితర పనులు చేస్తోంది.
Gland Pharma Results: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించే గ్లాండ్ ఫార్మా సంస్థ సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో 302 కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించిన ఈ కంపెనీ ఈసారి 20 శాతం తక్కువగా అంటే 241 కోట్ల నికర లాభంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సంస్థ మొత్తం ఆదాయం సైతం 2 శాతం తగ్గి రూ.1,110 కోట్లకే పరిమితమైంది.