అదానీ గ్రూప్‌కు సంబంధించి భారీ ఒప్పందం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్‌తో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం క్లీన్ ఎనర్జీకి సంబంధించినదిగా చెబుతున్నారు. ఈ ఒప్పందం ద్వారా.. అదానీ గ్రూప్ గుజరాత్‌లోని ఖవ్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కర్మాగారంలో ఉన్న కొత్త సోలార్-విండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ నుండి స్వచ్ఛమైన శక్తిని సరఫరా చేస్తుంది. ఈ కొత్త ప్రాజెక్ట్ 2025 మూడవ త్రైమాసికం నాటికి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని భావిస్తున్నారు. ‘గూగుల్ ఫర్ ఇండియా’ ఈవెంట్‌లో గూగుల్ ఈ విషయాన్ని ప్రకటించందింది. కాగా.. అదానీ గ్రూప్ ఈ అంశంపై ఒక ప్రకటనలో వివరణాత్మక విషయాలు వెల్లడించింది.
Read Also: Durgama Idols Destroyed: ఘోరం.. దుర్గామాత విగ్రహాలు ధ్వంసం.. ఎక్కడంటే?
“ఈ భాగస్వామ్యం ద్వారా, గుజరాత్‌లోని ఖవ్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కర్మాగారంలో ఉన్న కొత్త సోలార్-విండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ నుండి అదానీ స్వచ్ఛమైన శక్తిని సరఫరా చేస్తుంది” అని అదానీ గ్రూప్ ప్రకటన తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి వాణిజ్య కార్యకలాపాలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నాం.” ఈ వినూత్న ఒప్పందం భారతదేశంలో క్లీన్ ఎనర్జీతో ‘క్లౌడ్’ సేవలు, కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా.. గూగుల్ 24/7 కార్బన్-రహిత శక్తి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. ఇది భారతదేశంలో గూగుల్ యొక్క నిరంతర వృద్ధికి కూడా దోహదపడుతుంది.
Read Also: Tirumala Brahmotsavam 2024: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. భక్తులకు ఈవో కీలక సూచనలు