బిగ్ బాస్ సీజన్ 5 షో ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. మరో వారంలో బిగ్ బాస్ విజేతలు ఎవరనేది ప్రపంచానికి తెలిసి పోతుంది. నాటకీయ పరిణామాల మధ్య ఆరవ స్థానంలో నిలిచి కాజల్ హౌస్ నుండి ఆదివారం బయటకొచ్చేసింది. నిజానికి షణ్ముఖ్ కు ఉన్నట్టే కాజల్ కూ సోషల్ మీడియాలో బలమైన వర్గం సపోర్ట్ ఉంది. కానీ అది సరిపోలేదు. రవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయో… ఇప్పుడు కాజల్ విషయంలోనూ అదే జరిగింది. కాజల్ విషయంలో బిగ్ బాస్ సరైన నిర్ణయం తీసుకోలేదని, ఆమెకు అన్యాయం చేశాడని కొందరు వాపోతున్నారు.
ఇదిలా ఉంటే… ఇప్పుడు చర్చ మొత్తం టాప్ ఫైవ్ లో ఉన్న వారిలో ఎవరు విజేతగా నిలుస్తారనే దానిపై జరుగుతోంది. షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ చంద్ర, మానస్, సిరి… ఈ ఐదుగురిలో ప్రతి ఒక్కరికి తమవైన బలాలు, బలహీనతలు ఉన్నాయి.
Read Also : నిద్ర లేచింది ‘పురుష లోకం’.. సమంత సాంగ్ పై కేసు
ముందుగా సిరి విషయానికి వస్తే…. ఆమె డైరెక్ట్ గానే తాను షణ్ణు విజయం కోసం కృషి చేస్తానని, అవసరమైతే స్వచ్ఛందంగా ఫస్ట్ ప్లేస్ ను త్యాగం చేస్తానని చెప్పింది. ఇదే తరహాలో కాజల్ కూడా తన స్నేహితుల కోసం రాజీ పడింది. ఇప్పుడామె హౌస్ నుండే ఎలిమినేట్ అయిపోయింది. ఆ విషయంలో నాగార్జున లేడీ కంటెస్టెంట్స్ ఇద్దరినీ తప్పు పట్టాడు. మేల్ కంటెస్టెంట్స్ తమకోసం ఆడుతూ, ఫస్ట్ ప్లేస్ ను టార్గెట్ చేస్తే… లేడీస్ మాత్రం ఇతరుల కోసం ఆడుతున్నట్టు ఉందని విమర్శించాడు. ఆ రకంగా చూసినప్పుడు షణ్ణు కోసం హౌస్ లో ఉన్న సిరిని ఎవరూ విజేతగా ఊహించుకోలేరు, విజేతను కానివ్వరు కూడా! ఆ రకంగా సిరి తీసుకున్న తాజా నిర్ణయాలు ఆమెకు హర్డిల్స్ గా మారాయనటంలో ఎలాంటి సందేహం లేదు. టూ బీ ఫ్రాంక్…. షణ్ణు కంటే సిరి చాలా టాస్క్ లలో బెటర్ గా ఆడింది. హండ్రెడ్ పర్శంట్ పోరాడింది. కానీ షణ్ముక్ కారణంగా అదంతా మైనెస్ గా మారింది.
ఇక మానస్ సైతం విజేతగా నిలిచే ఆస్కారం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. తాను గెలవాలనే పట్టుదల కంటే… సన్నీని గెలిపించాలన్నదే మానస్ లోలోపల ఉందని, అందుకోసం మానస్ ఏదో ఒక సందర్భంలో రాజే పడే ఆస్కారం ఉందని అంటున్నారు. సన్నీతో ఉన్న బాండింగ్ మానస్ కు బెస్ట్ ఫ్రెండ్ గా మార్కులు వేయించొచ్చు కానీ బిగ్ బాస్ సీజన్ 5 విజేతను మాత్రం చేయలేవన్నది వారి విశ్లేషణ.
సింగర్ శ్రీరామచంద్ర విషయానికి వస్తే… మొదటి నుండి ఒంటరి పోరాటమే చేస్తున్నాడు. మొదటి రెండు మూడు వారాలు కాస్తంత లో-ప్రొఫైల్ మెయిన్ టైన్ చేసినా, ఆ తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు. అతను ఎవరితో కాస్త చనువుగా దగ్గర అవుతాడో, వాళ్లంతా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం అతన్ని మానసికంగా కృంగదీసింది. బట్ దాన్ని అధిగమించి టాస్క్ లలో పాల్గొన్నాడు. ఎవరితోనూ లబ్ది కోసం కావాలని గ్రూప్ కట్టే ప్రయత్నం చేయలేదు. బిగ్ బాస్ సీజన్ 5… టాప్ 5 కంటెస్టెంట్స్ లో స్ట్రాంగెస్ట్ పర్శన్ శ్రీరామ్ అనుకోవచ్చు. అయితే… శ్రీరామ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతవరకూ అతన్ని విజేతగా నిలిచేలా చేస్తుందన్నది అనుమానమే!
Read Also : బన్నీ, కొరటాల కాంబోలో భారీ ప్రాజెక్ట్… ‘పుష్ప’ కంటే ఎక్కువ !
ఇక మిగిలింది… సన్నీ, షణ్ముఖ్. జర్నలిజం నుండి యాంకరింగ్ మీదుగా, బుల్లి తెర నటుడు అయిన సన్నీకి అభిమాన గణం బాగానే ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండీ సన్నీ తనదైన ప్రతిభ చాటుతూనే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో అవసరానికి మించి, ఆవేశ పడినా, అది తన బలహీనత అని ఒప్పుకున్నాడు. మారే ప్రయత్నం చేశాడు. హౌస్ లో గడిచిన 14 వారాల్లో అతనిలో ఎంతో మార్పును వీక్షకులు చూశారు. అలానే టాస్క్ లలో స్పేస్ లేని చోట కూడా క్రియేట్ చేసుకుని మరీ, ఎంటర్ టైన్ మెంట్ అందించే ప్రయత్నం చేశాడు. అలా చూసినప్పుడు సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 విజేత కావడం ఖాయమనిపిస్తోంది. బట్… ఈ కార్యక్రమ నిర్వాహకుల ఈక్వేషన్స్ వేరే రకంగా ఉండొచ్చు. అలా కాకుండా జన్యూన్ గా ఈ షో జరిగి సన్నీ టైటిల్ గెలుచకుంటే, ఆనందించే వారు ఎక్కువ ఉంటారు.
బిగ్ బాస్ సీజన్ 5 మొదలైన రెండు, మూడు వారాల నుండి సోషల్ మీడియాలో ఓ ప్రచారం విస్తృతంగా జరుగుతూ వచ్చింది. ‘ఈసారి విజేత షణ్ముఖ్’ అనే ఆ ప్రచారాన్ని ఎవరూ ఖండించలేదు. షణ్ణుకూ సోషల్ మీడియాలో ఉన్న అభిమానులు, అతని పట్ల జనాలకు ఉన్న సానుభూతి, నాన్ కాంట్రవర్షియల్ పర్శన్ కావడం, వీలైనంత వరకూ తన టెంపర్ ను కోల్పోకుండా ఉండటం అందరికీ నచ్చింది.
ఇదే సమయంలో షణ్ణులోని మైనెస్ పాయింట్స్ ను అతని సొంత మనుషులే బయట పెట్టారు. అందరితో పాటు సమానంగా డాన్స్ చేయడం లేదనే ఆరోపణ స్వయంగా షణ్ణు తల్లి చేసింది. షణ్ణు, సిరి ఇంటిమెసీ కారణంగా గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన కోపంగా ఉందనే విషయాన్ని చూచాయగా వెల్లడించింది. ఇక సిరి తల్లి అయితే తన కూతుర్ని, షణ్ణుతో అతి చనువు పనికి రాదని హెచ్చరించింది. బట్ షణ్ణు, సిరి ఆ మాటలను పట్టించుకోకుండా ఇంకా ఎక్కువ మోతాదులో హగ్స్ ఇచ్చుకోవడం… ‘ఇది ఫ్రెండ్లీ హగ్’ అంటూ ప్రతిసారి నొక్కి చెప్పడం వీక్షకులకు అసహనాన్ని కలిగించింది. సిరిని షణ్ణు డామినేట్ చేసే ప్రయత్నం, ఆమె గేమ్ ఆమెను ఆడనీయకుండా షణ్ణు అడ్డుపడటం, ఇన్ ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయడం, తన తప్పులేకపోయినా సిరికి సారీ చెబుతున్నట్టు బిల్డప్ ఇవ్వడం… ఇవన్నీ జనాలకు నచ్చలేదు. దాంతో షణ్ణు విజేత అయ్యే ఆస్కారం లేదని అంటున్నారు.
Read also : వీడియో : “ఎఫ్3” ఫన్ స్టార్ట్… స్పెషల్ లుక్ లో వెంకటేష్
అయితే… ఈ షో మొదలైన కొత్తలో ప్రచారం జరిగినట్టుగా నిజంగానే విజేత విషయంలో ఫిక్సింగ్ అనేది జరిగితే ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే… ఈ ప్రచారానికి నాగార్జున ప్రవర్తన కొంత బలం చేకూర్చుతూ వచ్చింది. షణ్ణు ఎప్పుడైనా కాస్తంత డల్ కాగానే ‘ఏంట్రా షణ్ణూ’ అంటూ అతన్ని ఉత్తేజపర్చడం, ‘నీ నుండి ఇది కాదు బిగ్ బాస్ కోరుకుంటోంది’ అంటూ సున్నితంగా హెచ్చరించడం, షణ్ణును హౌస్ మేట్స్ ఎవరైనా విమర్శించినా, తప్పు పట్టినా నాగార్జున అతని తరఫున వకాల్త పుచ్చుకుని మాట్లాడంతో ‘దాల్ మే కుచ్ కాలా హై’ అనే భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకు తాజాగా జరిగిన ఓ సంఘటననూ ఉదాహరణగా చెబుతున్నారు. సన్నీ లాస్ట్ వీకెండ్ లో షణ్ణుకు ఫ్లాప్ స్టిక్కర్ అంటించాలని అనుకున్నప్పుడు, నాగార్జున పనికట్టుకుని, ‘ఈ వారం గురించి కాదు, పద్నాలుగు వారాలను దృష్టిలో పెట్టుకుని ట్యాగ్ చేయి’ చెప్పడంతో, సన్నీ…. షణ్ణును వదిలేసి సిరికి ఫ్లాప్ అనే స్టిక్కర్ అంటించాడు. ఆ రకంగా నాగార్జున ఎక్కడికక్కడ ఇన్ డైరెక్ట్ గా షణ్ణును సేవ్ చేస్తూ వచ్చాడని మెజారిటీ వ్యూవర్స్ భావిస్తున్నారు. సో… అలాంటి ఓ కన్సర్న్ షణ్ణు మీద నిజంగానే బిగ్ బాస్ కు ఉంటే మాత్రం షణ్ముఖ్ నే విజేత అవుతాడు! చూడాలి మరి బిగ్ బాస్ ఎలాంటి మాయ చేస్తాడో!