Top 5 Safest Cars in India: భారత్‌లో వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు సైతం పెరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం చాలా మంది ప్రజలు కారు కొనే మందు సేఫ్టీని చెక్ చేసుకుంటున్నారు. కొనుగోలుదారులు కార్ల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి నాణ్యత, కుటుంబానికి రక్షణ ఇచ్చే కార్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. కారు నిజంగా సురక్షితమా కాదా తెలుసుకోవడానికి చాలా మంది భారత్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్‌లను ఆధారంగా తీసుకుంటున్నారు. ఈ టెస్ట్ ఆధారంగా ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న, అత్యంత సురక్షితం టాప్ 5 కార్ల జాబితా గురించి తెలుసుకుందాం..
READ MORE: Snake and Mongoose Fight: పాము, ముంగీస్ మధ్య భీకర పోరాటం.. వైరలవుతున్న వీడియో
మహీంద్రా XEV 9E, TATA Harrier.ev గ్రేట్..
భారత్‌లో అత్యంత సేఫ్టీ కార్ల జాబితాలో మొదటి స్థానంలో మహీంద్రా XEV 9E ఉంది. ఇది భారతీయ కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారు. భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో అత్యధిక స్కోర్ సాధించింది. పెద్దల భద్రతకు 32కు గాను 32 పాయింట్లు, పిల్లల భద్రతకు 49 పాయింట్లకు గాను 45 సాధించింది. ఇది మహీంద్రా భద్రతపై ఎంతగా దృష్టి పెడుతోందో చూపిస్తుంది. టాటా హారియర్.ఈవీ ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV కూడా భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. పెద్దల భద్రతకు 32 పాయింట్లు, పిల్లల భద్రతకు 45 పాయింట్లు పొందింది. ఇది టాటా సురక్షితమైన ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ఎంత ముందుందో నిరూపిస్తుంది. ఇటీవల భారత్‌లో విడుదలైన మారుతి సుజుకి విక్టోరిస్ మిడిల్ సైజ్ SUV కూడా 5 స్టార్ భారత్ NCAP రేటింగ్ పొందింది. దీనికి పెద్దల భద్రతలో 31.66 పాయింట్లు, పిల్లల భద్రతలో 43 పాయింట్లు సాధించింది. ఈ జాబితాలో నాలుగో స్థానంలో టాటా పంచ్.ఈవీ ఉంది. ఇది చిన్న సైజ్ ఎలక్ట్రిక్ SUV అయినప్పటికీ 5 స్టార్ రేటింగ్ సాధించింది. పెద్దల భద్రతలో 31.46 పాయింట్లు, పిల్లల భద్రతలో 45 పాయింట్లు సాధించింది. చివరిగా మహీంద్రా థార్ రాక్స్ (Thar Roxx) ఉంది. ఇది ప్రముఖ థార్‌కి 5 డోర్ వెర్షన్. ఈ SUV కూడా భారత్ NCAP టెస్టుల్లో 5 స్టార్ భద్రత రేటింగ్ పొందింది. పెద్దల భద్రతకు 31.09 పాయింట్లు, పిల్లల భద్రతకు 45 పాయింట్లు సాధించింది. ఇవన్నీ ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న, అత్యంత సురక్షితమైన కార్లుగా గుర్తింపు పొందాయి.
READ MORE: Tata Sierra Top Speed Test: టాటా సియెర్రా ఫర్ఫామెన్స్ వేరే లెవల్ గురూ.. టాప్ స్పీడ్ ఎంతంటే..?