Tata Sierra Top Speed Test: టాటా సియెర్రా ఫర్ఫామెన్స్ వేరే లెవల్ గురూ.. టాప్ స్పీడ్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Sierra 1.5 Hyperion Top Speed Test: టాటా మోటార్స్ తమ కొత్త Hyperion 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఒక పెద్ద విజయాన్ని సాధించింది. ఈ ఇంజిన్‌ను కొత్త టాటా సియెర్రా (Tata Sierra) హై వేరియంట్లలో ప్రవేశపెట్టారు. ఇండోర్‌లోని NATRAX టెస్ట్ ట్రాక్‌లో చేసిన హై-స్పీడ్ టెస్ట్‌లో ఈ ఇంజిన్ ఉన్న సియెర్రా 222 కిలోమీటర్లు గంట వేగాన్ని సాధించింది. దీంతో ఇది ఇప్పటివరకు వచ్చిన సియెర్రాలలో అత్యంత వేగవంతమైన మోడల్‌గా నిలిచింది. Hyperion 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కేవలం 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజిన్ Adventure+, Accomplished, Accomplished+ వేరియంట్లలోనే లభిస్తుంది. ఈ ఇంజిన్ ఉన్న మోడల్ ధరలు ఎక్స్-షోరూమ్ రూ.17.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.
READ MORE: Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం భారీ సెట్.. ఎంట్రీ సాంగ్‌తోనే బాక్సాఫీస్ షేక్?
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
కొత్త టాటా సియెర్రా బయట నుంచి చూసేందుకు బాక్సీ డిజైన్‌తో పాత మోడల్‌ను గుర్తు చేసేలా కనిపిస్తుంది. నిలువుగా ఉన్న స్టాన్స్, గ్లోస్-బ్లాక్ ప్యానెళ్లతో LED హెడ్‌లైట్లు, DRLs, బ్రాండ్ లోగో, “Sierra” లెటరింగ్ అందంగా సూపర్ లుక్‌ను అందిస్తాయి. ముందువైపు బంపర్‌లో స్కిడ్ ప్లేట్, ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ లోపల ప్రీమియం ఇంటీరియర్ అమర్చారు. డాష్‌బోర్డ్‌పై మూడు డిస్‌ప్లేలు ఉంటాయి. ఒకటి డ్రైవర్ ముందు, రెండు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఏర్పాటు చేశారు. ఇవి ఒకే కంటెంట్‌ను షేర్ చేయగలవు. టాటా కర్వ్ నుంచి తీసుకున్న 4-స్పోక్ స్టీరింగ్ వీల్‌లో లైటింగ్ లోగో, టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. 12 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, సెగ్మెంట్‌లో తొలిసారి వచ్చిన SonicShaft సౌండ్‌బార్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, దేశంలో అతి పెద్ద ప్యానోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జర్, వెనుక సన్‌షేడ్స్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. లోపల సాఫ్ట్-టచ్ ప్యానెల్స్, ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్ సైతం అద్భుతంగా లగ్జరీ లుక్ ని ఇస్తుంది.
READ MORE: Starlink: అమెరికా, దుబాయ్, భూటాన్, బంగ్లాదేశ్‌లలో.. స్టార్‌లింక్ ప్లాన్ ధర ఎంతంటే?
సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారు లెవల్-2 ADAS ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ బ్లైండ్ స్పాట్ డిటెక్టర్లు, 21 ఫంక్షన్లతో ESP వంటివి ఉన్నాయి. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్, సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్లు, పిల్లల సేఫ్టీ కోసం ISOFIX సపోర్ట్, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో టాటా సియెర్రా ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా విడుదలైంది. ఈ ఎస్‌యూవీ బుకింగ్స్ డిసెంబర్ 16, 2025 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు జనవరి 15, 2026 నుంచి మొదలవుతాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!