SUVs Launch: ప్రస్తుతం ఇండియన్ కార్ మార్కెట్‌లో SUV వాహనాలకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ మేకర్స్ అన్నీ కూడా ఈ సెగ్మెంట్లలో కొత్త కార్లు ఇంట్రడ్యూస్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా కాంపాక్ట్ SUV కార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఇదిలా ఉంటే కొత్తగా SUV కార్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లైతే, కొత్తగా 5 ఎస్‌యూవీ కార్లు మార్కెట్‌లో లాంచ్ కాబోతున్నాయి. ప్రముఖ కంపెనీలైన టయోటా, సిట్రోయెన్, మహీంద్రా, హ్యుందాయ్ నుంచి ఈ కార్లు రాబోతున్నాయి.
1. టయోటా టైసర్:
టయోటా ఏప్రిల్ 3న తన కాంపాక్ట్ SUV కూపే స్టైల్‌తో వస్తున్న టైసర్‌ని ఆవిష్కరించబోతోంది. ఇది మారుతి సుజుకి ఫ్రాంక్స్ రీబ్యాడ్జ్ వెర్షన్. 1.0L టర్బో పెట్రోల్ మరియు 1.2L NA పెట్రోల్ ఇంజన్‌లను అలాగే వాడుతూ, కొన్ని అప్డేట్లతో రాబోతోంది.
2. సిట్రోయెన్ బసాల్ట్:
ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయెన్ భారత్ మార్కెట్‌లో తన వాటాను పెంచుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తన ‘బసాల్ట్’ ఎస్‌యూవీ కార్‌ని త్వరలో భారతీయ రోడ్లపైకి తీసుకురాబోతోంది. 1.2L టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో, ఇది CMP ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. టాటా నుంచి రాబోతున్న కర్వ్‌కి ఇది పోటీగా ఉంటుంది.
3. మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్:
ఇండియన్ ఆటో దిగ్గజం మహీంద్రా నుంచి కొత్తగా ఫేస్‌లిఫ్టెడ్ XUV300 వస్తోంది. మరింత స్టైలిష్‌గా, టెక్ లోడెడ్ ఫీచర్లతో 1.2L పెట్రోల్ మరియు 1.5L డీజిల్ ఇంజిన్‌ల ఈ కార్ రానుంది.
4. హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్:
హ్యుందాయ్ యొక్క అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్, 2024 మధ్య నాటికి అందుబాటులోకి రాబోతోంది. క్రేటాలో ఉన్న ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్స్ అల్కాజర్‌లో ఉండనున్నాయి. 1.5L డీజిల్ మరియు 1.5L టర్బో పెట్రోల్ ఇంజిన్‌లను అలాగే ఉంచుతూ.. లెవెల్ 2 ADAS వంటి కొత్త ఫీచర్ల ఉండే అవకాశం ఉంది.
5. Tata Curvv EV:
భారత ఈవీ మార్కెట్లో టాటాకు తిరుగులేకుండా ఉంది. టాటా నుంచి టియాగో, టిగోర్, నెక్సాన్ ఈవీ కార్లు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల పూర్తి ఈవీ ప్లాట్‌ఫాంపై నిర్మితమైన టాటా పంచ్.ఈవీ మార్కెట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం టాటా తన కర్వ్ ఈవీని ఈ ఏడాది ద్వితీయార్థం తీసుకువచ్చే అవకాశం ఉంది. ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ రేంజ్ ఇచ్చేలా ఈ కార్ ఉండబోతున్నట్లు సమాచారం.