Cars in August:ఫెస్టివల్ సీజన్ రాబోతోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కార్ మేకర్ కంపెనీలు కూడా తమ కొత్త మోడళ్లని మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతున్నాయి. ముందు ఆగస్టు నెలలో మూడు SUV కార్లు ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ అవుతున్నాయి. దేశీయ కార్ కంపెనీలు మహీంద్రా, టాటాతో పాటు ఫ్రెంచ్ ఆటోమేకర్ సిట్రోయెన్ నుంచి కొత్త కారు రాబోతోంది.
Citroen Basalt: కూపే స్టైల్ డిజైన్‌తో టాటా కర్వ్ రాబోతోంది. ఆగస్టు 7న ఇండియన్ మార్కెట్‌లోకి ఈ కార్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదిలా ఉంటే కర్వ్‌కి ప్రత్యర్థిగా ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయన్ బసాల్ట్ కారును మార్కెట్‌లోకి దింపుతోంది.
SUVs Launch: ప్రస్తుతం ఇండియన్ కార్ మార్కెట్‌లో SUV వాహనాలకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ మేకర్స్ అన్నీ కూడా ఈ సెగ్మెంట్లలో కొత్త కార్లు ఇంట్రడ్యూస్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా కాంపాక్ట్ SUV కార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.