Nitish Kumar: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రతిపక్షాల నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్ష నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా కేజ్రీవాల్ కు అండగా నిలిచారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఈ కేసులో ఆదివారం హాజరుకావాలని సీబీఐ శుక్రవారం సమన్లు జారీ చేసింది.
Read Also: The Sun: సూర్యుడిపై పొంగిన ప్లాస్మా.. ఏకంగా లక్ష కిలోమీటర్ల ఎత్తు..
కేజ్రీవాల్ తీసుకుంటున్న అనేక చర్యలకు సరైన సమయంలో బదులిస్తారని నితీష్ కుమార్ అన్నారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. కేజ్రీవాల్ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారనన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ఐక్యంగా పనిచేస్తామని నితీష్ కుమార్ వెల్లడించారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి వ్యతిరేఖంగా ప్రతిపక్ష పార్టీల కూటమిని ఏర్పాటు చేసేందుకు నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నాడు. ఇందు కోసమే ఆయన ఇటీవల ఢిల్లీ పర్యటకు వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో ఆయన భేటీ అయ్యారు. ఆ తరువాత అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశం అయ్యారు. ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే తమను తాము నాశనం చేసుకున్నట్లే అని నితీష్ అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తే దేశ, రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన వారు అవుతారని వ్యాఖ్యానించారు.