Noida: దీని కోసం “ప్రాంక్” చేస్తారా..? పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించిన ఇన్‌స్టా పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noida: సోషల్ మీడియాలో స్టూడెంట్ పెట్టిన సూసైడ్ పోస్ట్ నోయిడా పోలీసులును పరుగెత్తించింది. బాలుడిని కాపాడేందుకు మొత్తం నోయిడా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా సెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 10వ తరగతి విద్యార్థి పోస్ట్ “ఆత్మహత్య వీడియో”ని చూశారు. బాలుడిని రక్షించేందుకు, బాలుడు ఉన్న లొకేషన్ ట్రేస్ చేసేందుకు పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుండి సహాయం తీసుకున్నారు. ఏప్రిల్ 26 తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుందని సెంట్రల్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ దీక్షిత్ తెలిపారు.
Read Also: Voyager-2: భూమి నుంచి 2 వేల కోట్ల కి.మి. ప్రయాణం.. సిగ్నల్ చేరాలంటే 18 గంటలు.. ఇది వాయేజర్ ఘనత
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
సూసైడ్ వీడియో చూడగానే గౌతమ బుద్ధనగర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించింది. వివరాలు తీసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి బాలుడిని కనుగొన్నారు. ఇదంతా చేస్తే పోలీసులకు మాత్రం ఆ బాలుడు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు. కొన్ని గంటల పాటు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఈ సూసైడ్ పోస్ట్ ‘‘ప్రాంక్’’ అని తేలింది. ఇన్‌స్టాగ్రామ్ లో తనకు వ్యూస్ తక్కువగా రావడంతో, వ్యూస్ పెంచుకునేందుకు ఇలా చేసినట్లు చెప్పాడు. మస్కిటో రిఫిల్లర్ ఆల్ అవుట్ లో లిక్విడ్ ను తీసేసి దాంట్లో నీరు నింపి తాను తాగి చనిపోతున్నట్లు బాలుడు వీడియో తీసి పోస్ట్ చేశాడని పోలీసులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం బాలుడిని వైద్య పరీక్షలకు పంపించి, కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
గతంలో నోయిడా పోలీసులు 20 ఏళ్ల వ్యక్తి ‘‘ అంతా అయిపోయింది’’ అనే పోస్ట్ చూసి అతడిని ఆత్మహత్య నుంచి రక్షించారు. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఇలాంటి కేసుల్ని చేధించి బాధితులను రక్షించేందుకు 2022లో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాతో ఒప్పందం చేసుకున్నారు. రియల్ టైమ్ లో ఇలాంటి ఆత్మహత్యలకు సంబంధించిన పోస్టులను గుర్తించి ప్రజలను రక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!