Disney Hotstar: డిస్నీ హాట్‌స్టార్‌కి జియో సినిమా దెబ్బ.. 4 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఔట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disney Hotstar: స్ట్రీమింగ్ దిగ్గజంగా ఉన్న డిస్నీ హాట్‌స్టార్ వేగంగా తన సబ్‌స్క్రైబర్లను కోల్పోతోంది. ముఖ్యంగా ఇండియాలో జియో సినిమా దెబ్బకు కుదేలవుతోంది. జియోసినిమా IPL స్ట్రీమింగ్ ని ఫ్రీగా అందించడంతో వినియోగదారులు ఎక్కువగా జియోసినిమాకు కనెక్ట్ అవుతున్నారు. తక్కువ సమయంలో జియోసినిమా ఎక్కువ ప్రజాధరణ పొందేందుకు ఇది కారణం అయింది. ఇది డిస్నీ హాట్‌స్టార్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆసియాలో డిస్నీ సబ్‌స్క్రైబర్ బేస్ వేగంగా క్షీణించింది. కేవలం మూడు నెలల్లో, స్ట్రీమింగ్ దిగ్గజం 4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. అక్టోబర్ 2022 నుంచి ఏకంగా 8.4 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది.
Read Also: తమిళ డైరెక్టర్స్ చేతిలో మోసపోయిన తెలుగు హీరోలు వీరే..?
Also Read
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
ఇండియాలో స్ట్రీమింగ్ దిగ్గజంగా జియోసినిమా ఎదగాలని అనుకుంటోంది. అందుకోసం వేగంగా పావులు కదుపుతోంది. 2023 తొలి మూడు నెలల్లోనే జియోసినిమాకు 10 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను పొందింది. 2023 తొలి త్రైమాసికంలో డిస్నీ హాట్ స్టార్ చందాదారులు 3.8 మిలియన్ల తగ్గి 57.5 మిలియన్లకు చేరింది. వరసగా రెండు త్రైమాసికాల్లో డిస్నీ క్షీణతను ఎదుర్కోవాల్సి వచ్చింది.
జియోసినిమా వచ్చీ రావడంతోనే ఐపీఎల్ తో సహా మొత్తం ఫ్రీగా అందించింది. ఇది డిస్నీ హాట్ స్టార్ ను దెబ్బకొట్టింది. ఉచితంగా వస్తున్నపుడు ప్రజలు ఎందుకు డబ్బులు కట్టాలని భావిస్తారు. ఇదే డిస్నీని దెబ్బతీసింది. ఇదిలా ఉంటే రిలయన్స్ జియో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో ప్రముఖ హాలీవుడ్ కంటెంట్‌ను దాని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, జియోసినిమాకు తీసుకురావడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. రిలయన్స్ యొక్క వయాకామ్ 18 మరియు వార్నర్ బ్రదర్స్ మధ్య ఈ భాగస్వామ్యం ద్వారా హెచ్‌బిఓ కంటెంట్‌తో పాటు వార్నర్ బ్రదర్స్ షోలు కూడా జియోసినిమాలో అందుబాటులోకి వస్తాయి. గతంలో HBO కంటెంట్ డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉండేది. ఈ రెండింటి మధ్య ఒప్పందం మార్చి 31తో ముగిసింది. ఆ తరువాత జియోసినిమా HBOతో ఒప్పందం చేసుకుంది.
తాజావార్తలు
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!