UP Local Body Elections: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఎదురులేకుండా పోయింది. ప్రతిపక్షంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నామమాత్రపు ప్రభావాన్ని చూపింది. మే 4, 11 తేదీల్లో రెండు విడతలుగా
Karnataka Election Results: సంప్రదాయంగా బీజేపీకి అండగా నిలుస్తున్న లింగాయత్ వర్గం ఈ సారి ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. బీజేపీ చివరి నిమిషంలో రిజర్వేషన్లు ప్రకటించినా కూడా లింగాయల్ వర్గంలో ఉన్న అసంతృప్తిని అణచలేకపోయారు. ఫలితంగా బీజేపీకి గట్టి పట్టున్న స్థానాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా మెజారిటీ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఈ రోజు వెలువడిన ఎన్నికల్లో ట్రెండ్స్ ను పరిశీలిస్తే ఇదే అర్థం అవుతుంది.
Leaders' reaction to BJP's defeat: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం దిశగా సాగుతోంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 113ని దాటి 137 స్థానాల్లో విజయం దాదాపుగా ఖరారు అయింది. బీజేపీ కేవలం 63 స్థానాలకు, జేడీఎస్ 20 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యంపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.
DK Shivakumar: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం వైపు వెళ్తోంది. మెజారిటీ మార్కును దాటేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 138 స్థానాల్లో, బీజేపీ 63, జేడీఎస్ 20 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ విజయంపై కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటకలో సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. కర్ణాటక ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ద్వేషంతో చేసే రాజకీయాలు ముగిశాయని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రేమతో విజయం సాధించామని అన్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ద్వేషం యొక్క మార్కెట్ మూసివేయబడింది మరియు ప్రేమ దుకాణాలు తెరవబడ్డాయి" అని ఆయన అన్నారు.
Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోంది. 139 స్థానాల్లో ఇప్పటికే లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని ఆశిస్తున్నట్లు సిద్దరామయ్య అన్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ గాంధీ 2024లో ప్రధాని అవుతారని కాంగ్రెస్ అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు.
Air India: ఎయిర్ ఇండియా విమానంలోకి ఓ పైలెట్ తన స్నేహితురాలిని కాక్పిట్ లోకి తీసుకెళ్లిన ఘటనలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు పైలెట్ పై మూడు నెలల సస్పెన్షన్ విధించింది. దీంతో పాటు ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల ఫైన్ విధించింది.
Retail inflation: ఏప్రిల్ నెలలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్భణం తగ్గినట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కంఫర్ట్ జోన్ లోనే వరసగా రెండో నెల కొనసాగినట్లు నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) విడుదల చేసిన డేటాలో వెల్లడించింది. వినియోగదారుల ధర సూచి ఆధారంగా (సీపీఐ) ద్రవ్యోల్భణం 18 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఏప్రిల్ నెలలో 4.7 శాతంగా ఉంది. రరిటైల్ ద్రవ్యోల్భణం మార్చి నెలలో 5.66 శాతంగా ఉంటే ఇది ఏప్రిల్ లో 4.7 శాతానికి చేరినట్లు గణాంకాలు వెల్లడించాయి. నవంబర్ 2021 నుంచి…
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. రేపు మధ్యాహ్నం వరకు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే విషయం తెలుస్తుంది.
Supreme Court: ‘మోడీ ఇంటిపేరు’ వివాదంలో రాహుల్ గాంధీకి శిక్ష విధించిన సూరత్ కోర్టు న్యాయమూర్తితో పాటు గుజరాత్ రాష్ట్రంలో కింది కోర్టుల్లో పనిచేస్తున్న 68 మంది న్యాయమూర్తులకు ప్రమోషన్లు ఇవ్వడంపై స్టే విధించింది. సూరత్ కోర్టు న్యాయమూర్తి హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ కూడా ఇందులో ఉన్నారు. వీరి ప్రమోషన్లు చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. హరీష్ హస్ముఖ్ భాయ్ తో సహా 68 మంది న్యాయమూర్తులు జిల్లా జడ్జీ క్యాడర్ కు ప్రమోట్ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ లో…