Badruddin Ajmal: కర్ణాటకలో బీజేపీ పరాజయంతో 2024 ఎన్నికల్లో విపక్షాల కూటమి అనేది చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఓడించాలంటే విపక్షాల ఐక్యత ముఖ్యమని భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే అస్సాంకు చెందిన వివాదాస్పద నేత, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్, విపక్ష కూటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడేందుకు విపక్ష కూటమిలో చేరాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.
Read Also: Adah Sharma: ది కేరళ స్టొరీ హీరోయిన్ కి యాక్సిడెంట్…
అజ్మల్ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్ ప్రతినిధి బృందం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను కలిసింది. మొదటి నుంచి మేము కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో ఉననామని, ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి మా పార్టీ ప్రతిపక్ష ఐక్యతకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం తెలిపారు. దేశంలోని అన్ని ప్రతిపక్షాలు ఒకే వేదికపైకి రావాలని, బీజేపీని గద్దె దించాలంటే ఇదే మార్గమని ఆయన అన్నారు. ప్రతిపక్షాల కూటమిలో కాంగ్రెస్ పాలు పంచుకోవాలని సూచించారు.
బీజేపీని ఓడించేందుకు తమ పార్టీ త్యానికైనా సిద్ధమని అమీనుల్ ఇస్లాం అన్నారు. అస్సాంలో తమ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారని, అంతకుముందు అస్సాంలో మూడు పార్లమెంటరీ స్థానాల్లో గెలిచామని, ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో మూడో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్నామని, బీజేపీని నిర్మూలించేందుకు మా పార్టీ త్యాగాలను చేస్తుందని అమీనుల్ ఇస్లాం అన్నారు. ప్రస్తుతం ఏఐయూడీఎఫ్ కు, కాంగ్రెస్ తో పెద్దగా సంబంధాలు లేవు. అయితే తమ పార్టీ కాంగ్రెస్ తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.