Contact Lenses: కొన్ని రకాల కాంటాక్ట్ లెన్సుల్లో క్యాన్సర్ కు కారణమయ్యే కారకాలు ఉంటున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. యూఎస్ నుంచి వచ్చిన అనేక సాఫ్ట కాంటాక్ట్ లెన్సుల్లో ఎక్కువగా విషపూరితమైన, క్యాన్సర్‌కు కారణమయ్యే ‘ఫరెవర్ కెమికల్స్’తో తయారయ్యాయని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 18 పాపులర్ రకాల కాంటాక్ట్ లెన్సులను పరీక్షించారు. ప్రతీదానిలో పాలీఫ్లోరో పాలీఫ్లోరోఅల్కైల్ పదార్ధం (PFA) మార్కర్ అయిన ఆర్గానిక్ ఫ్లోరిన్ అధిక స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు.
సాధారణంగా నీటిని, వేడిని తట్టుకునే ఉత్పత్తుల్లో ఈ పీఎఫ్ఏని ఉపయోగిస్తారు. 14000 రసాయనాల్లో పీఎఫ్ఏఎస్ ఒకటిగా ఉంది. బట్టలు, ఫర్నిచర్, ప్యాకేజింగ్, వైర్స్, ఇంటిలో వాడే పలు రకాల వస్తువులతో కూడా వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా ఇవి విచ్చిన్నం కావు. అందకే వీటిని ‘ఫరెవర్ కెమికల్స్’ అంటారు.
Read Also: Kapil Sibal: “వచ్చే 5 ఏళ్లు…” కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్‌కు సిబల్ సందేశం..
పీఎఫ్ఏ లు క్యాన్సర్లు, కాలేయ సమస్యలకు, మూత్రపిండాల వ్యాధులకు, ఆటోఇమ్యూన్ డిసార్డర్లకు కారణం అవుతుంది. మమవేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ న్యూస్ పబ్లిక్ హెల్త్ బ్లాగ్ పలు బ్రాండ్లలోని లెన్సుల్లో ఫ్లోరిన్ జాడల కోసం వెతికింది. వీటిలో 105 పీపీఎమ్( పార్ట్స్ ఫర్ మిలియన్) నుంచి 20,700 పీపీఎం మధ్య ఫ్లోరిన్ ను కనుగొన్నారు. పరీక్షించిన అన్ని కాంటాక్ట్ లెన్సుల్లో ఇది 100 పీపీఎమ్ ను మించిపోయింది.
లెన్సులను స్వచ్ఛమైన పీఎఫ్ఏలుగా పరిగణించవచ్చని పరిశోధకులు హెచ్చరించారు. ఆస్టిగ్మాటిజం (20,000పిపిఎమ్), ఆల్కాన్ ఎయిర్ ఆప్టిక్స్ కలర్స్ విత్ స్మార్ట్‌షీల్డ్ టెక్నాలజీ (20,700పిపిఎమ్), డైలీ వేర్ కోసం ఆల్కాన్ టోటల్30 కాంటాక్ట్ లెన్స్‌లు (20,400 పీపీఎం), ఈ మూడు కాంటాక్ట్ లెన్సుల్లో అధిక మొత్తంలో ఆర్గానిక్ ఫ్లోరిన్ ఉన్నట్లు తెలిపారు. అయితే కాంటాక్ట్ లెన్సుల్లోని పీఎఫ్ఏలు కంటిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తేలలేదని, దీనిపై అధ్యయనాలు చేయాలని పరిశోధకులు తెలిపారు.
కాంటాక్ట్ లెన్సులు మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుండి వచ్చే అన్ని టాయిలెట్ పేపర్‌లు కూడా విషపూరితమైన ‘ఫరెవర్ కెమికల్స్’ ఉంటాయని, ఇవి కాలుష్యానికి మూలం కావచ్చని తెలిపారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ఇటీవలి అధ్యయనాలు PFAS వినియోగం అధిక స్థాయిలో కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలు, మూత్రపిండాలు, వృషణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో పాటు పిల్లల్లో టీకాల ప్రభావం కూడా తగ్గేందుకు అస్కారం ఉందని తెలిపింది.