Earthquake: జపాన్ దేశంలో భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 3.33 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. జపాన్ రాజధాని టోక్యోకు తూర్పు ఆగ్నేయంగా 107 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
COVID-19: 2019లో చైనాలోని వూహాన్ నగరంలో ప్రారంభం అయిన కరోనా మహమ్మారి, ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. తన రూపాలను మార్చుకుంటూ ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని వణికించింది. ఇటీవలే కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా కోవిడ్ ఎమర్జెన్సీని ముగించింది.
Monsoon: జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించబోతున్నాయి. సాధారణంగా జూన్ 1న కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా అంటే జూన్ 4 తేదీన కేరళలోకి ప్రవేశిస్తున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది.
Imran Khan: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో దివాళా అంచుకు చేరిన పాకిస్తాన్ పరిస్థితి, రాజకీయ అస్థిరతతో సతమతం అవుతోంది. అక్కడి ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ తిరుగుబాటు చేస్తున్నారు. ఇటీవల ఆయన అరెస్ట్ సమయంలో, ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.
Parliament Inauguration: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది. మే 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతోంది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని ప్రధాని ప్రారంభం చేయడాన్ని తప్పుబడుతూ.. న్యాయవాది జయ సుకిన్ పిటిషన్ పిటిషన్ దాఖలు చేశారు. భారత ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతిని కాదని ప్రధాని కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
New Parliament building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం అవుతోంది. ఆదివారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు.
Kerala: కేరళలో డ్రగ్స్ వినియోగం గురించి కొచ్చి పోలీస్ కమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో డ్రగ్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందనే విషయాలను వెల్లడించారు. అన్ని స్థాయిల్లో ఉన్న పోలీస్ అధికారుల పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిస అవుతున్నారని కొచ్చి పోలీస్ కమిషనర్ కే. సేతురామన్ అన్నారు
Deve Gowda: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించేందుకు అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయమా.?? అని ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని, ఇది దేశ ప్రజల ఆస్తి, ఇది వ్యక్తిగత విషయం కాదని ఆయన అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాక్యలు చేశారు.
Vande Bharat Trains: భారతీయ రైల్వేలను ఆధునీకీకరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైళ్లను ప్రారంభించింది. సెమీ హైస్పీడ్ ట్రైన్ గా ఇప్పటికే పలుమార్గాల్లో ఈ రైల్ ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి 3 రకాల వందే భారత్ ట్రైన్లను తీసుకువస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. శతాబ్ధి రాజధాని, లోకల్ ట్రైన్ల స్థానంలో వీటిని తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ స్వదేశీ సెమీ హైస్పీడ్ ట్రైన్లను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు…