North Korea: సముద్రంలో కుప్పకూలిన నార్త్ కొరియా స్పై శాటిలైట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ఉత్తర కొరియా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గూఢచారి ఉపగ్రహం సముద్రంలో కుప్పకూలింది. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని ఎంతో కీలకంగా భావించారు. జపార్, సౌత్ కొరియాల అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ ప్రయోగం చేపట్టారు. అయితే శాటిలైట్ ప్రయోగ సమయంలో రాకెట్ లో సాంకేతిక లోపం సంభవించింది. దీంతో సముద్రంలో కుప్పకూలిపోయినట్లు ఆదే మీడియా వెల్లడించింది.
ఈ ప్రయోగానికి కిమ్ చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. స్వయంగా ఆయన వెళ్లి సైంటిస్టులతో మాట్లాడటంతో పాటు ప్రయోగాన్ని సమీక్షించారు. తన కుమార్తె జుయితో కలిసి ఇటీవల రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని సందర్శించారు. ఉత్తర కొరియా అధికారుల ప్రకారం.. నార్త్ ఫియోంగాన్ ప్రావిన్స్‌లోని చోల్సాన్ కౌంటీలోని సోహే శాటిలైట్ లాంచింగ్ కేంద్రం నుంచి చొల్లిమా-1 అనే రాకెట్ ద్వారా మల్లిగ్యోంగ్-1 అనే సైనిక స్పై శాటిలైట్ ను ప్రయోగించారు. రాకెట్ మొదటి దశ పూర్తయిన తర్వాత రెండో దశలో రాకెట్ లో ఇంజిన్ అసాధారణంగా పనిచేయడంతో సముద్రంలో కూలిపోయింది. ప్రయోగం విఫలం అవడానికి కారణాలు అణ్వేషించి త్వరలో రెండో ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా తెలిపింది.
Also Read
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
Read Also: Air India: ఫ్లైట్ లో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. సిబ్బంది పై దాడి..
ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించిందని.. ఇది రాడార్ నుంచి అదృశ్యమైందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగం గురించి ఒక రోజు ముందు జపాన్ కు సమాచారం ఇచ్చింది. జపాన్, దక్షిణ కొరియా ఈ ప్రయోగాన్ని తీవ్రంగా విమర్శించాయి. బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతతో కూడిన ఎలాంటి పరీక్షల నుంచి ఉత్తర కొరియాను నిరోధించేలా ఐక్యరాజ్య సమితిని ఆంక్షలను ఉల్లంఘించిందని విమర్శించాయి.
ఉత్తర కొరియా, అమెరికా-దక్షిణ కొరియాల నుంచి ముప్పు ఉందని పేర్కొంటూ ఇటీవల కాలంలో విపరీతంగా బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షిస్తూ పోతోంది. 2019లో అమెరికాతో దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలం అయినప్పటి నుంచి ఉత్తర కొరియా సైనిక అభివృద్ధిని రెట్టింపు చేసింది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ గత సంవత్సరం తన దేశాన్ని “తిరుగులేని” అణుశక్తిగా ప్రకటించాడు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!