West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో తీవ్ర హింస చెలరేగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు హింసకు పాల్పడుతున్నాయని బీజేపీతో సహా ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి.
NSA Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దేశ విభజన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే భారతదేశ విడిపోయేది కానది అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక ఉపన్యాసంలో మాట్లాడుతూ.. నేతాజీ జీవితంలో వివిధ దశల్లో ధైర్యాన్ని ప్రదర్శించాని అననారు. మహాత్మా గాంధీని ఎదురించే దైర్యం సుభాష్ చంద్రబోస్ కి ఉందని ఆయన అన్నారు.
Uganda: ఆఫ్రికా దేశం ఉగాండాలో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉన్న మిలిటెంట్లు దారుణానికి తెగబడ్డారు. 37 మంది విద్యార్థులను అత్యంత దారుణంగా నరికి కాల్చి చంపారు. ఇది ఈ దశాబ్ధంలోనే అత్యంత దారుణమైన సంఘటన అని ఉగాండా అధికార వర్గాలు పేర్కొన్నాయి. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సమీపంలోని కాసేస్ జిల్లాలోని మ్పాండ్వేలోని సెకండరీ స్కూల్‌పై శుక్రవారం అర్థరాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
Maharashtra:మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఇంటి ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శనివారం ఉదయం థానేలోని సీఎం నివాసం ముందు 42 ఏళ్ల ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు.
Adipurush: ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’పై పలు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. ఆదిపురుష్ లోని కొన్ని డైలాగ్స్ అత్యంత అభ్యంతరకరంగా, తక్కువ గ్రేడ్ చిత్రాల్లోని డైలాగ్స్ లా ఉన్నాయని ఆరోపించింది. ఈ సినిమాకు బీజేపీ మద్దతు ఉందని దుయ్యబట్టింది.
Fake ChatGPT apps: నకిలీ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్స్ రూపొందిస్తున్నారు స్కామర్లు.
China: ప్రస్తుత కాలంలో ఉద్యోగం దొరకడమే కష్టం.. అలాంటిది దొరికిన ఉద్యోగాన్ని చేసుకోకుండా, వాటికి రాజీనామా చేయాలంటే మనదేశంలో అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ చైనాలో మాత్రం విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. అక్కడి యువత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను వదిలేస్తోంది.
Venkaiah Naidu: ఇటీవల కాలంలో చట్టసభలు, న్యాయవ్యవస్థల మధ్య కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Sharad Pawar: తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ మోడల్ పాలనను విస్తరించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేశారు. తెలంగాణను అనుకుని ఉన్న సరిహద్దు మహారాష్ట్ర గ్రామాలు తెలంగాణలో అమలు చేస్తునటువంటి పథకాలు తమకు కూడా కావాలని డిమాండ్ చేస్తున్నారు.