Newly wed sisters flee with gold: కొందరు కొత్త తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. వివాహానే దొంగతనాలకు దారిగా ఎంచుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన తర్వాత పెళ్లికూతుర్లు నగలు, నగదులో ఉడాయించిన సంఘటనలు మనం గతంలో చూశాము. మరోసారి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇదే సీన్ రిపీట్ అయింది. అన్నదమ్ములను పెళ్లి చేసుకున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అత్తగారించే కన్నం వేశారు. ఏకంగా నగలు, నగదుతో ఉడాయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ పట్టణంలో జరిగింది.
Read Also: Rs.1 Lakh aid for BCs : బీసీలకు లక్ష సాయం.. కీలక విషయాలు వెల్లడించిన మంత్రి గంగుల
వివరాల్లోకి వెళ్తే.. తాటీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్పన్ కాలనీకి చెందిన భరత్ గుప్తా, అతనికి తమ్ముడయ్యే రోహిత్ గుప్తాలకు యూపీ గోరఖ్ పూర్ కి చెందిన సంజన, అంజలిలతో ఈ నెల 11న వివాహం జరిగింది. భరత్ గుప్తా అత్త కొడుకు బంటీగుప్తా, అతని స్నేహితుడు జీతూ ఈ పెళ్లిళ్లను కుదిర్చారు. ఇదిలా ఉంటే ఐదురోజుల తర్వాత భరత్ గుప్తా హైకోర్టులో పని నిమిత్తం వెళ్లారు. ఈ సమయంలో సంజన, అంజలి ఇంట్లో బంగారం, రూ.2.5 లక్షల నగదులో పారిపోయారు. ఘటన జరిగిన సమయంలో భరత్ తల్లి, అక్క ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు.
భరత్ కి ముందుగా తల్లి ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే భార్యకు ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. ఈ ఘటనపై భరత్ గుప్తా పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు అక్కాచెల్లిళ్లపై ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని పరాస్ ఖండ్, బర్తద్వా హరేణ్య మహారాజ్ గంజ్ చిరునామాతో ఉన్న వారి ఆధార్ కార్డులను పోలీసులకు అందించారు. దీనిపై విచారణ జరుగుతోంది.