PM Modi US Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi US Visit: 3 రోజుల అమెరికా పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరారు. భారత కాలమాన ప్రకారం జూన్ 21న తెల్లవారుజామున 1.30 గంటలకు వాషింగ్టన్ లోని ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో దిగాల్సి ఉంది. అక్కడ భారతీయ అమెరికన్ బృందం ఆయనకు స్వాగతం పలుకుతుంది. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు ఒక మలుపుగా భావిస్తున్నారు. రక్షణ రంగంలో సహకారం, సాంకేతిక బదిలీకి సంబంధించి కీలక ఒప్పందాలు జరగనున్నాయి. 2019లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో ప్రధాని పర్యటనపై ప్రపంచ దేశాలు చాలా ఆసక్తి చూపిస్తున్నాయి.
Read Also: Himalayas: పొంచి ఉన్న ముప్పు.. 65 శాతం వేగంగా కరుగుతున్న హిమాలయ హిమానీనదాలు….
Also Read
జూన్ 21 నుంచి 23 వరకు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయంలో 180 దేశాల ప్రతినిధులతో పాల్గొననున్నారు. జూన్ 22న అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో మోడీ ప్రసంగిస్తారు. అదే రోజు ప్రెసిడెంట్ బైడెన్ దంపతులు వైట్ హౌజులో మోడీకి స్వాగతం పలకనున్నారు. బైడెన్ తో భేటీ కానున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, 5 కీలక రంగాల్లో పరస్పర సహకారం, రెండు దేశాల మధ్య వ్యాపార-వాణిజ్య బంధాల గురించ చర్చిస్తారు. ఇదే రోజు సాయంత్రం ప్రెసిడెంట్ జోబైడెన్ ఆయన సతీమణి, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ మోడీకి విందు ఇవ్వనున్నారు.
జూన్ 23న వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సంయుక్తంగా మోడీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. వాషింగ్టన్ లో ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు, ప్రధాన కంపెనీలు ప్రతినిధులను, నిపుణులతో మోడీ సమావేశం కానున్నారు. భారత అమెరికన్లను కలుసుకోనున్నారు. ఈ సమావేశం అనంతరం జూన్ 24, 25 తేదీల్లో ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని హోదాలో మోడీ తొలిసారిగా ఈజిప్టు పర్యటనకు వెళ్తున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi leaves from Delhi for his first official State visit to the United States.
He will attend Yoga Day celebrations at the UN HQ in New York and hold talks with US President Joe Biden & address to the Joint Session of the US Congress in… pic.twitter.com/y6avSoPpkd
— ANI (@ANI) June 20, 2023
Leaving for USA, where I will attend programmes in New York City and Washington DC. These programmes include Yoga Day celebrations at the @UN HQ, talks with @POTUS @JoeBiden, address to the Joint Session of the US Congress and more. https://t.co/gRlFeZKNXR
— Narendra Modi (@narendramodi) June 20, 2023
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు