Himalayas: దాదాపు రెండు బిలియన్ల మంది ప్రజలకు కీలకమైన నీటిని అందిస్తున్న హిమాలయ హిమనీనదాలు(గ్లేసియర్స్) అత్యంత వేగంగా కరుగుతున్నాయి.ఈ పరిణామం రానున్న రోజుల్లో హిమాలయాలపై ఆధారపడి ఉన్న దేశాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ గ్లేసియర్స్ అనూహ్యంగా కరిగిపోతున్నట్లు శాస్త్రవేత్తలు మంగళవారం హెచ్చరించారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ (ICIMOD) నివేదిక ప్రకారం.. గత దశాబ్ధంతో పోలిస్తే 2011 నుంచి 2020 వరకు 65 శాతం వేగంగా గ్లేసియర్స్ కనుమరుగవుతున్నాయి.
వాతావరణం వేడెక్కుతున్న కొద్ధీ మంచు కరుగుతోంది. ఇది మనం ఊహించిన దానికన్నా ఆందోళన కలిగించే వేగంతో కరుగుతున్నట్లు ప్రధాన రచయిత పిలిప్సస్ వెస్టర్ చెప్పారు. హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలోని హిమనీనదాలు పర్వత ప్రాంతాల్లో సమారు 240 కోట్ల మంది ప్రజలతో పాటు దిగువన ఉన్న 165 కోట్ల ప్రజలకు హిమాలయాల నుంచి వచ్చే నీరే కీలక వనరుగా ఉందని నివేదిక పేర్కొంది.
Read Also: Rs.2000 Note Withdrawal: రూ. 2000 నోటు ఉపసంహరణ మంచిదే.. జీడీపీ వృద్ధిని పెంచవచ్చు..
ప్రస్తుతం వెలువడుతున్న ఉద్గారాల ప్రకారం.. ఈ శతాబ్ధం చివరి నాటికి హిమనీనదాలు వాటి ప్రస్తుత పరిమాణంలో 80 శాతం కోల్పోవచ్చని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనాల, భారతదేశం, మయన్మార్ , పాకిస్తాన్ సభ్యదేశాలగా ఉన్న నేపాల్ కు చెందిన ICIMOD తెలిపింది. హిమానీనదాలు గంగ, సింధు, ఎల్లో, మెకాంగ్, ఐరావడ్డీ నదులతో పాతటు 10 ముఖ్యమైన నదుల వ్యవస్తకు కీలకం. ప్రత్యక్షంగా, పరోక్షంగా బిలియన్ల మందికి ఆహారం, శక్తి, స్వచ్ఛమైన గాలి, ఆదాయాన్ని అందిస్తున్నాయి.
పారిస్ వాతావరణ ఒప్పందంలో భాగంగా గ్లోబల్ వార్మింగ్ 1.5 నుంచి 2.0 డిగ్రీలకు పరిమితమైనప్పటీకీ.. హిమనీనదాలు 2100 నాటికి వాటి పరిమాణంలో మూడింట నుంచి సగం వరకు కోల్పోతాయని అంచనా వేశారు. 1800ల మధ్యకాలం నుండి ప్రపంచం సగటున దాదాపు 1.2 C వేడెక్కింది, తీవ్రమైన హీట్‌వేవ్‌లు, మరింత తీవ్రమైన కరువులు మరియు తుఫానులతో సహా తీవ్ర వాతావరణంపై ప్రభావం చూపుతున్నాయి. సాంకేతికతలను మెరుగుపరచడం, హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల అంచనాలో ఈ ప్రభావాలను అంచనా వేయవచ్చని వెస్టర్ తెలిపారు.